Chiranjeevi About Conversation with Narendra Modi in Swearing Ceremony:  పీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం సభలో ఎన్నో ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నాయి. ఓ పక్క సీఎం చంద్రబాబు, మంత్రుల పవన్ ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరోపక్క భావోద్వేగభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి ముందు పవన్‌ కళ్యాణ్‌‌ చిరంజీవి కాళ్లకు నమస్కారం చేయడం.. నందమూరి బాలకృష్ణ ఆయన చెల్లెలు నారా భువన్వేశరి దగ్గరకి వచ్చి పలకిరించి ఆమె నుదుట ముద్దు పెట్టాడం.. ఇలా స్టేజ్‌పై ఎన్నో భావోద్వేగ సంఘటనలు కళ్లుముందుకు కనిపించాయి.


ఈ ప్రమాణ స్వీకారం మొత్తంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో మాట్లాడిన సన్నివేశం అందరిని ఆకట్టుకుటుంది. స్వయంగా మోదీనే చిరంజీవి, పవన్‌ని హత్తుకుని.. వారిని పలకరించడం ఆసక్తిని సంతరించుకుంది.  ఈ సందర్భంగా ఆయన చిరు, పవన్‌లతో జరిపిన సంభాషణ ఏంటని, ప్రధాని.. చిరంజీవితో ఏం మాట్లాడారా? అని అంతా ఆలోచనలో పడ్డారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అక్కడ ఏం జరిగిందా? అని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వీడియోపై స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. స్టేజ్‌పై మోదీతో జరిగిన సంభాషణను ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు. 






ఈ మేరకు చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. "ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ , నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, ‘ఎన్నికల ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ మీ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూశారనీ, అది తనని భావోద్వేగానికి  గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువలను ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి’ అని ఆయన అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా  కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!" అంటూ చిరంజీవి అసలు విషయం చెప్పుకొచ్చారు. 



కాగా ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ కళ్యాణ్‌ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లి చిరంజీవి గురించి చెప్పిన సంగతి తెలిసిందే. చిరంజీవి మాట్లాడాతరంటూ చూపించగానే పవన్‌ను తీసుకుని ఆయనే చిరంజీవి దగ్గరికి వెళ్లారు. చిరుని ఆలింగనం చేసుకుని ఇద్దరితో కాసేపు ముచ్చటించారు. ఈ ద్రశ్యం అక్కడ ఉన్నవారందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల్లో గెలుపు అనంతరం తొలిసారి అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. గెలుపుతో వెళ్లిన పవన్‌ అన్నయ్యను చూడగానే కాళ్లమీద పడ్డారు. విక్టరితో వచ్చిన తమ్ముడు పవన్‌ను చిరు అప్యాయంగా పలకిరించి ముద్దాడారు. అనంతరం మెగా కుటుంబ సభ్యులంతా పవన్‌ చేత కేక్‌ చేయించారు. ఎమోషనల్‌గా సాగిన ఈ మొత్తం వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అదే వీడియోను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సభలో తనతో ప్రస్తావించినట్టు చిరంజీవి వెల్లడించారు.  


Also Read: మంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం - ఎమోషనలైన భార్య అన్నా లెజ్నెవా, ఆకట్టుకుంటున్న వీడియో