Sree Vishnu Swag Latest Update: హీరో శ్రీ విష్ణు సినిమాలంటే ఆడియన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. వైవిధ్యమైన కథ, కథనాలతో అలరిస్తూ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంటాడు. తన సినిమాల్లో కామెడీతో పాటు సీరియస్‌నెస్‌ ఉండేలా చూసుకుంటాడు. ముఖ్యంగా ఆ కథతో ఆడియన్స్‌కి మెసేజ్‌ ఇస్తుంటాడు. అలా సినిమా సినిమాకు కొత్త జానర్‌ను టచ్‌ చేస్తూ ఫ్యాన్స్‌ అలరిస్తున్నాడు. అలా ఈ సారి శ్రీవిష్ణు మరో సరికొత్త కంటెంట్‌తో వస్తున్నాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తున్న ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు.






Swag First Single Update: రితూ వర్మ హీరోయిన్‌. ఇటీవల ఈ మూవీకి 'స్వాగ్‌' (Swag Movie) అనే టైటిల్‌ను ఖరారు చేసి అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇక టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ఇది మగవాడి కథ అంటూ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేశారు. ఇక ఈ సినిమా నుంచి మరో క్రేజ్‌ అప్‌డేట్‌ రిలీజ్‌కు రెడీ అయ్యింది మూవీ టీం. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ ఫేం టేస్టి తేజతో ప్రమోషన్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సందర్బంగా హీరో శ్రీవిష్ణు, హీరోయిన్‌ రీతూ వర్మలతో కలిసి టేస్టి తేజ భోజనం చేస్తూ మూవీ గురించి ఆరా తీశాడు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు ఏంటన్న విశేషాలు అని అడగ్గా.. "ఏముంది సమ్మర్‌ పోతున్నట్టు ఉంది.. వర్షకాలం వచ్చేలా ఉంది. మూవీ షూటింగ్స్‌ ఎలా జరుగుతాయా? అని ఆలోచిస్తున్నా.. అంటూ చమత్కరిస్తాడు శ్రీవిష్ణు.



ఆ తర్వాత స్వాగ్‌ విశేషాలు ఏంటని అడగ్గా.. స్వాగ్‌ అంటేనే విశేషం అంటాడు. కింగ్‌ స్వాగ్‌ అయిపోయింది.. క్వీన్‌ స్వాగ్‌ అయిపోయింది.. నెక్ట్స్‌ ఏంటి? అని అడగగా.. ఈసారి దెబ్బకు దెబ్బే. కంటెంట్‌ అంతా రెడీ ఇక నామకరణం కోసమే ముహుర్తం చూస్తున్నాం. ఇది అచ్చమైన తెలుగు సినిమా అని. పేరు షార్ప్‌గా ఉండాలి. పేరు మగాడిదై ఉండాలి" అంటూ వారి కన్వర్‌జేషన్‌ సాగింది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ పీపుల్స్‌ మీడియాలో ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. స్వాగ్‌ నెక్ట్స్‌ అప్‌డేట్‌ రాజోర్‌ అని, ఇది షార్పెట్‌ మగాడి కంటెంట్‌ అంటూ క్యాప్షన్స్‌. రాజోర్‌ జూన్‌ 14న వచ్చేస్తుందంటూ క్రేజ్‌ అప్‌డేట్‌ వదిలింది. అయితే ఇది మూవీ ఫస్ట్‌ సింగిల్‌ అని తెలుస్తోంది. రాజోర్‌ అని హీరో శ్రీవిష్ణుపై సాగే పాట అని సమాచారం. దీంతో ఈ అప్‌డేట్స్‌ చూసి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. రాజోర్‌ కోసం వేయిటింగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


Also Read: మంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం - ఎమోషనలైన భార్య అన్నా లెజ్నెవా, ఆకట్టుకుంటున్న వీడియో