Varalaxmi Sarathkumar Marriage Update: తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుంది. ఇప్పటికే పెళ్లి ముహుర్తం కూడా ఫిక్స్ చేసి పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. ఇప్పటికే రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులకు కుటుంబంతో కలిసి పెళ్లి పత్రిక అందజేసింది.
అయితే పెళ్లి తేదీ, వివాహ వేడుక ఎక్కడనేది ఇంకా శరత్ కుమార్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ క్రమంలో వరలక్ష్మి పెళ్లికి సంబంధించి తరచూ పుకార్లు బయటకు వస్తున్నాయి. ఆమె పెళ్లి జరిగేది ఇండియాలో కాదని, విదేశాల్లోనే అనేది ముందు నుంచి ఉన్న సమాచారం. తాజాగా వరలక్షి పెళ్లి వేదికకు సంబంధించి ఓ వార్త తమిళ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జూలై 2న గ్రాండ్‌గా డిస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని, థాయ్‌లాండ్‌లో ఆమె వెడ్డింగ్ ప్లాన్స్ ఏర్పాట్టు భారీగా జరుగుతున్నాయట.
ఇప్పటికే ఆ దేశంలో పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హల్దీ, మెహెందీ నుంచి అన్ని వేడుకలు థాయ్‌లాండ్‌లోనే జరగనున్నాయట. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ థాయ్‌లాండ్‌నే వరలక్ష్మి, కోలాయ్ సచ్‍దేవ్‍లు పెళ్లి కోలీవుడ్‌లో గట్టిగా ప్రచారం జరుగుతుంది. కాగా ఈ ఏడాది మార్చిలో వరలక్ష్మి, నికోలాయ్ సచ్‍దేవ్ నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ అనంతరం ఫోటోలు షేర్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఏదేమైనా ఎట్టకేలకు తమ అభిమాన నటి పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలిసి ఫ్యాన్స్ అంతా ఖుష్ అయ్యారు.
ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‍దేవ్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది. తన చిన్ననాటి మిత్రుడైన నికోలస్‌ను వరలక్ష్మి ప్రేమ పెళ్లి చేసుకోబోతుంది. అయితే ఇప్పటికే నికోలాయ్ సచ్‍దేవ్‍కి పెళ్లై విడాకులైన సంగతి తెలిసిందే. గతంలో కవిత అనే మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసు ఉన్న ఆమె పేరు కష సచ్‌దేవ్ . ఆమె పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్ పతకాలు కూడా సాధించిందట. అయితే కొన్నేళ్ల క్రితమే నికొలయ్-కవితకు డైవోర్స్ కావడంతో వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ, ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు.
వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. లేడీ విలన్‌గా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి మొదట హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది. నటుడు శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 'పొడా పొడి' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించిన వరలక్ష్మి సహానటి పాత్రలు కూడా చేసింది. ఆ తర్వాత ఆమె ఆఫర్స్ తగ్గడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో 'తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ' సినిమాతో లేడీ విలన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జాంబి రెడ్డి', 'నాంది', 'యశోద', 'వీరసింహా రెడ్డి' వంటి సినిమాల్లోనూ విలన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్‌లో అక్క పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుంది.
Also Read: మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం - ఎమోషనలైన భార్య అన్నా లెజ్నెవా, ఆకట్టుకుంటున్న వీడియో