Budh Gochar 2024 : జూన్ 14 నుంచి నెలాఖరు వరకూ మేషం, మిథునం సహా ఈ రాశులవారికి గోల్డెన్ టైమ్!

Mercury Transit 2024 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం వల్ల ఐదు రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది...

Continues below advertisement

Mercury Transit 2024 : గ్రహాల యువరాజుగా చెప్పే బధుడు..మిగిలిన గ్రహాల కన్నా తొందరగా రాశి పరివర్తనం చెందుతుంటాడు. కొన్నిసార్లు 15 రోజులకోసారి రాశి మారిపోతాడు. జూన్ 14 న నుంచి ఈ నెలాఖరు వరకూ రెండు వారాల పాటూ మిథున రాశిలోనే ఉంటాడు. బుధుడి రాశిపరివర్తనంతో మిథున సహా ఈ రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులొస్తాయి. ఈ రెండు వారాలు వీరి జీవితంలో అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. ఆ ఐదు రాశుల్లో మీ రాశి ఉందా..ఇక్కడ చెక్ చేసుకోండి...

Continues below advertisement

మేష రాశి

మిథునంలో బుధుడి రాశి పరివర్తనం ఈ రాశి ఉద్యోగులకు మంచి ఫలితాలనిస్తుంది.  కార్యక్షేత్రంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది  సహోద్యోగుల సహకారంతో కష్టమైన పనులు కూడా నెరవేరుతాయి. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారులు పర్యటనకు వెళతారు. నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం బావుంటుంది. 

Also Read: కుంభ రాశిలో శని తిరోగమనం - 140 రోజుల పాటూ ఈ రాశులవారిపై శని ప్రతికూల ప్రభావం!

మిథున రాశి

గ్రహాల యువరాజు సంచారం మీ రాశిలోనే కావడంతో మీకన్నీ అనుకూల ఫలితాలే ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సీనియర్ల సహకారంతో మీ కెరీర్ వృద్ధిచెందుతుంది. వ్యాపారులకు బుధుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది.  

సింహ రాశి 

మీరు పని చేసే చోట మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బుధుడి సంచారం కారణంగా ఉద్యోగులు పనితీరు మెరుగుపడి ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇది మంచి సమయం అవుతుంది. 
 
కన్యా రాశి 

బుధుడి సంచారం కన్యారాశివారికి శుభఫలితానిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. మీరు పని చేసే స్థలంలో మీకు అనుకూల ఫలితాలుంటాయి. సహోద్యోగుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. నూతన శక్తితో పనిచేస్తారు. మీ సంపద  పెరుగుతుంది. జూన్ 14 తర్వాత వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఈ సమయంలో వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  

Also Read: మిథున రాశిలోకి సూర్యుడు - జూన్ 15 నుంచి జూలై 16 వరకూ ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే !

తులా రాశి
 
మిథునంలో బుధుడి రాశి పరివర్తనం తులారాశివారికి అదృష్టాన్నిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు..ఇతర రంగాల్లో ఉండేవారు అన్నీ అనుకూల ఫలితాలే సాధిస్తారు. కెరీర్లో పురోగతికి కొత్త అవకాశాలొస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. సంతోషం పెరుగుతుంది.

ధనస్సు రాశి

బుధుడి రాశిమార్పు సమయంలో మీరు చేపట్టే పనులన్నీ విజయవంతం అవుతాయి. నూతన అవకాశాలు పొందుతారు..వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆదాయం మునుపటి కన్నా మెరుగుపడుతుంది కానీ ఖర్చులు అదుపుచేయాల్సిందే. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం...

బుధుడిని మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్,  తెలివి, స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెబుతారు...అందుకే శుభ స్థానంలో ఉంటే అదృష్టం కలిసొస్తుంది. 

Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

Continues below advertisement
Sponsored Links by Taboola