lavanya tripathi misses Pawan Kalyan oath ceremony: ఏపీ మంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరయ్యారు. ప్రత్యేకంగా బస్‌ ఏర్పాటు చేసుకుని మరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఈ కార్యక్రమంలో మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి కనిపించలేదు. వరుణ్ తేజ్‌తో పెళ్లి అనంతరం ఆమె మెగా ఫ్యామిలీకి చెందిన ప్రతి వేడుకలో పాల్గొంటుంది. అంతేకాదు కోడలిగా తన బాధ్యతలు కూడా పంచుకుంటుంది.


అంతేకాదు పండగలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వేడుకలు హడావుడి చేస్తూ సందడి చేస్తుంది. అయితే ప్రతి వేడుకలో ఉండే ఆమె మెగా ఫ్యామిలీలో అతి ముఖ్యమైన పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఏంటని అంతా ఆరా తీశారు. లావణ్య త్రిపాఠి ఎక్కడా? అని అంతా సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణం ఏంటో వెల్లడిచిందింది లావణ్య త్రిపాఠి. ఈ మేరకు ఓ ఫోటో షేర్‌ చేస్తూ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాను గాయపడ్డానని, అందువల్లే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లలేకపోయినట్టు స్పష్టం చేసింది. 



లావణ్య త్రిపాఠి తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. ఇందులో కాలుకు కట్టు వేసి ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో షేర్‌ చేసింది. ఇది షేర్‌ చేస్తూ కాలుకు గాయమైందని, నడవలేని స్థితిలో ఉన్నానట్టు స్పష్టం చేసింది. అయితే స్టోరీ లావణ్య అసలేమైందనేది వెల్లడించలేదు. దీంతో అంతా ఆమె కాలికి ఏమైందని, గాయం ఎలా అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరో పోస్ట్‌ షేర్‌. అయితే ఇందులో తనకు ఏమైందనేది చెప్పకుండ సస్పెన్స్‌లో ఉంచింది. ఈ పోస్ట్‌లో "మీతో మాట్లాడటం చాలా బాగుంది. అయితే మీ ప్రతిఒక్కరికి ఇప్పుడు సమాధానం చెప్పలేను. కానీ త్వరలోనే తిరిగి వస్తా" అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది.ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశం అయ్యింది.


 





అసలు ఏమైందో చెప్పకుండ లావణ్య త్రిపాఠి పరోక్ష కామెంట్స్‌తో కొత్త వ్యవహరిస్తుందంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మీరు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు. అయితే లావణ్య త్రిపాఠికి నెల క్రితమే కాలికి గాయమైందట. ఇంట్లో మెట్లు ఎక్కుతుండగా తన చీలమండ మడత పడటంతో నవడలేని స్థితిలో ఉందట. అయితే చిన్న గాయమే అని ఆమె విశ్రాంతి లేకుండ ఇంటి పనులతో బిజీగా అవ్వడం వల్ల నొప్పి మరింత ఎక్కువ అయ్యింది. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నట్టు లావణ్య తన ఓ పోస్ట్‌లో పేర్కొంది.  కాగా పెళ్లి తర్వాత లావణ్య సినిమాలపై ఆసక్తి తగ్గించినట్టు తెలుస్తోంది. చివరిగా ఆమె మిస్ పర్ఫెక్ట్ వెబ్ సరీస్ తో అలరించింది. ప్రస్తుతం మెగా కోడలిగా ఇంట్లోనే ఉంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. 


Also Read: రెండు వారాల ముందే థియేటర్లోకి వస్తున్న 'దేవర' - కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..