Jr NTR and Prashanth Neel Movie Shooting Update: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల తర్వాత మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ సినిమాల లైనప్‌ మామూలుగా లేదు. అన్ని పాన్‌ ఇండియా, భారీ ప్రాజెక్ట్సే. ఇప్పటికే దేవర సినిమాలో బాక్సాఫీసును షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు తారక్‌. మరోవైపు బాలీవుడ్‌ భారీ యాక్షన్‌ మూవీ వార్‌ 2లో బాలీవుడ్‌లో పాగ వేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా తారక్‌ ఇప్పటికే కేజీయఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు.


ఎప్పుడో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. #NTR31 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీని అనౌన్స్‌ చేశారు. ఈ ప్రకటన వచ్చి కూడా ఏడాది గడిచిపోయింది. అయితే అప్పటికే ప్రభాస్‌ సలార్‌ మూవీతో బిజీగా ఉండటం, తారక్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటం, వెంటనే దేవర వీ షూటింగ్‌ మొదలు పెట్టడంతో ఈ ప్రాజెక్ట్‌ ఇంకా పట్టాలెక్కలేదు. ఇక సలార్‌ పార్ట్‌ 1 విడుదలైంది.. ఇటూ ఎన్టీఆర్‌ కూడా దేవర నుంచి కొద్ది రోజుల్లో ఫ్రీ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు #NTR31 బజ్‌ మొదలైంది.


కొద్ది రోజులు ఈ సినిమా మెల్లిమెల్లిగా అప్‌డేట్స్‌, గాసిప్స్‌ మొదలయ్యాయి. దీంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా డ్రాగన్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. దీంతో టైటిల్‌పై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. దీనికి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు అదే టైటిల్‌ను ఫిక్స్ చేశారంటూ తాజాగా ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన కూడా ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాను ఆగస్ట్‌లో సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.




అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్‌ చేందిన ఓ నటుడు కీ రోల్‌ పోషిస్తున్నాడని, ఆయనే ఈ విషయాన్ని లీక్ చేశాడంటూ సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. లేదా ప్రశాంత్‌ నీల్‌ అండ్‌ టీం నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే. కాగా ప్రశాంత్‌ నీల్‌ సినిమాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ సినిమాలన్ని డార్క్‌ థీంలో ఉంటాయి. ఫ్రాంచైజ్‌లుగా సినిమాలను తెరకెక్కిస్తూ తన సినిమాటిక్ వరల్డ్‌ల చికటి ప్రపంచాన్ని క్రియేట్‌ చేస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్‌.



ఇప్పటికే కేజీయఫ్‌, సలార్‌ చిత్రాలతో ఇండియన్ మూవీ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించాడు. ఒక్కదాన్ని మిం ఒక్క సినిమాలు ఉండటంతో ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌, క్యారెక్టరైజేషన్‌కి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పుడు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌తో సినిమా అంటే దాన్ని ఏ రేంజ్‌లో ప్లాన్‌ చేసి ఉంటాడా? అని అంతా ఊహల్లో తేలిపోతున్నారు. ఇక ఫ్యాన్స్‌ మాత్రం తారక్‌ క్యారెక్టరైజేషన్‌ ఎలా ఉండబోతుందా? అని ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ షూటింగ్‌కి సంబంధించిన ఈ అప్‌డేట్‌ చూసి ఫ్యాన్స్‌ అంతా పండగ చేసుకుంటున్నారు. 


Also Read: డిస్నీ+ హాట్‌స్టార్‌‌కు పాకెట్‌ఎఫ్‌ఎం షాక్ - ఆ వెబ్‌ సిరీస్‌పై కాపీ రైట్‌ ఆరోపణలు, హైకోర్టులో పటిషన్‌ దాఖలు..