Pocket FM Filed Petition on Delhi HC against Disney+ Hotstar: ఎప్పటికప్పుడ సరికొత్త కంటెంట్‌, వెంబ్‌సరీస్‌, సినిమాలు, సీరియల్స్‌ ఓటీటీ ప్రియులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. దీంతో టాప్‌ డిజిటల్‌ ఫాట్‌ఫాంలో డిస్నీ+ హాట్‌స్టార్‌ ఒకటిగా నిలుస్తోంది. అయితే ఇప్పుడీ సంస్థ చిక్కుల్లో పడింది. హాట్‌స్టార్‌ వేదికగా యక్షిణి అనే వెబ్‌ సిరీస్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రేపు ఈ మూవీ స్ట్రీమింగ్‌కి వస్తుందనగా ఓ ఆడియో స్ట్రిమింగ్‌ సంస్థ హాట్‌స్టార్‌కి షాకిచ్చింది. ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది.


అంతేకాదు హాట్‌స్టార్‌పై కాపీరైట్‌ ఆరోపణలు కూడా చేసింది. ఇంతకి అసలేం జరిగిందంటే..  ఓటీటీలో దిగ్గజ ప్లాట్‌ఫాంగా ఎంతో మంది డిజిటల్‌ ప్రేక్షకులు ఆదరాభినం పొందుతున్న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌‌ ఇప్పుడు చిక్కుల్లో పడింది.  పాకెట్‌ఎఫ్‌ఎం(PocketFM) సంస్థ తన ఆడియో సిరీస్‌ని డిస్నీప్లస్‌ హట్‌స్టార్‌ కాపీ చేసిందంటూ ఢిల్లీ హైకోర్టులో పటిషన్‌ దాఖలు చేసింది. వెంటనే కోర్టు దీనిపై స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. పటిషన్‌ ప్రకారం.. కాగా కొంతకాలంగా పాకెట్ఎఫ్ఎం ఆన్‌లైన్‌ వేదికగా పెయిడ్‌ పద్దతిలో ఎన్నో ఆడియో సిరీస్‌లని అందిస్తుంది. అందులో ఒకటి యక్షిణి కూడా.


ఈ యక్షిణి ఆడియో సిరీస్‌ని పెయిడ్‌ పద్ధతిలో కస్టమర్లకు అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కాపీ రైట్స్‌ హక్కులను కూడా ఈ పాకేట్‌ఎఫ్‌ఎం కలిగి ఉందట. అయితే ఈ యక్షిణిని అదే టైటిల్‌తో ‌ హాట్‌స్టార్‌ వీడియో రూపంలో వెబ్‌సిరీస్‌కు తీసుకురాబోతుంది. అంతేకాదు దీని స్ట్రీమింగ్‌కి సంబంధించిన జోరుగా ప్రచారం కూడా చేసుకుంటుంది. రేపు (జూన్‌ 14) నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కూడా కాబోతోంది. అయితే ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ స్ట్రిమింగ్‌ ఆపేయాలని, దీనికి హాట్‌స్టార్‌ నుంచి తొలగించాలంటూ పాకెట్‌ఎఫ్‌ఎం సంస్థ జూన్‌ 11న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.






డిస్నీ+ హాట్‌స్టార్‌ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కోర్టులో పటిషన్‌ వేసింది. అలాగే ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని పాకెట్‌ఎఫ్‌ఎం తన పిటిషన్‌లో కోరును విజ్ఞప్తి చేసింది. నేడు గురువారం ఈ పిటిషన్‌ జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణకు రాగా.. ఈ వ్యవహారంపై డిస్నీ+ హాట్‌స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసుపై ఫైనల్‌ తీర్పు వచ్చేవరకు యక్షిణి వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే మే 2021 నుంచి ‘యక్షిణి’ ఆడియో సిరీస్‌ పాకెట్‌ఎఫ్‌ఎంలో స్ట్రీమింగ్‌ అవుతున్నట్టు సమాచారం. 


Also Read: డిస్నీ+ హాట్‌స్టార్‌‌కు పాకెట్‌ఎఫ్‌ఎం షాక్ - ఆ వెబ్‌ సిరీస్‌పై కాపీ రైట్‌ ఆరోపణలు, హైకోర్టులో పటిషన్‌ దాఖలు..