Devara Movie New Release Date: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అప్‌డేట్స్‌ కూడా మూవీ మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఫియర్ సాంగ్‌కి ఆడియన్స్‌ నుంచి భారీ స్పందన లభించింది. దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ పలు వాయిదాల అనంతరం అక్టోబర్‌ 10న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇక దసరా కానుకగా దేవర థియేటర్లోకి రాబోతుందని, ఇది పండగా సినిమా అవుతుందంటూ ఫ్యాన్స్ అంతా మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికి షాకిస్తూ దేవర విడుదల మళ్లీ వాయిదా పడింది.  సినిమాను రిలీజ్‌ డేట్‌ వాయిదా వేస్తున్నట్టు మూవీ టీం వరుస ట్వీట్స్‌ చేస్తుంది. వస్తున్నా అంటూ కొద్ది సేపటి క్రితం 'దేవర' టీం ఓ ట్వీట్‌ వదిలింది.  ఇప్పుడు తాజాగా 'హాయ్ ఆల్‌' అంటూ మరో ట్వీట్‌ చేసింది. దీంతో ఇది కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటనకి సంబంధించింది అయ్యి ఉంటుందంటూ అంతా ఊహించారు. అందరు అనుకున్నట్టుగానే దేవర మూవీ మళ్లీ వాయిదా పడింది. కానీ, రిలీజ్ తేదీలో మార్పు జరిగిన ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ అవుతున్నారు. 






ఎందుకంటే దేవర రిలీజ్ డేట్ మరింత ముందుకు వచ్చింది. తాజాగా మూవీ కొత్త రిలీజ్ డేట్‌ మూవీ టీం ప్రకటించింది. ఈసారి అనుకున్న తేదీ కంటే ముందుగానే వచ్చేస్తున్నాడు. సప్టెంబర్‌ 27, 2024న వరల్డ్‌ వైడ్‌గా మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది మూవీ టీం.  ముందుగానే దేవర థియేటర్లోకి వస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ‌ కాగా 'జనతా గ్యారేజ్' వంటి సూపర్‌ హిట్‌ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.



ఇక ఇందులో తారక్‌కి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా రోల్‌ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె ఈ చిత్రాన్‌ని నిర్మిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. మూవీ అప్డేట్స్ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి. 


Also Read: మీ అన్నదమ్ముల ఆప్యాయత నన్ను భావోద్వేగానికి గురిచేసింది - సభలో చిరంజీవితో మోదీ, మెగాస్టార్‌ ఎమోషనల్ పోస్ట్‌..