Daily Horoscope -  రాశిఫలాలు (15-05-2024)


మేష రాశి
జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయి. హడావుడిగా ప్రయాణించాలని ప్రణాళికలు వేసుకోకండి. ఆస్తి విషయంలో వివాదాలు రావచ్చు. విద్యార్థులు మెంటర్ల సలహాలు తీసుకోవడం ద్వారా కెరీర్ సవాళ్లను అధిగమించవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 


వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు అవుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.  ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజు సులభంగా రుణం లభిస్తుంది. 


Also Read: మే 16 or 17 సీతానవమి ఎప్పుడు - విశిష్టత ఏంటి!


మిథున రాశి
మిథునరాశి వారికి ఈరోజు శుభదినం. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వృత్తి జీవితంలో సీనియర్ల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కెరీర్‌లో విజయాల మెట్లు ఎక్కుతారు. వ్యక్తిగత ,వృత్తి జీవితంలో సమతుల్యత ఉంటుంది. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. 


కర్కాటక రాశి
ఈ రోజు మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త పెట్టుబడి ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండొద్దు. వ్యాపార ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా సరిచూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త ధన వనరులు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.  


సింహ రాశి
సింహ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా లాభపడతారు. కొత్త వ్యూహంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. విద్యా పనుల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.


Also Read: ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం


కన్యా రాశి
కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తి జీవితం బావుంటుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త ఇల్లు కొనడం లేదా విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు రోజంతా బిజీగా ఉంటారు. మీరు కొత్త పనులకు బాధ్యత వహిస్తారు. పనిలో సవాళ్లు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. 


తులా రాశి
తుల రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో పురోగతికి బంగారు అవకాశాలు ఉంటాయి. బంధువులతో కలిసి కుటుంబ కార్యక్రమానికి హాజరవుతారు. వ్యాపార పరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. ఒంటరిగా ఉండే ఆలోచన చేయవద్దు. 


వృశ్చిక రాశి
ఈరోజు ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. పనికిరాని ఆలోచనలను వదిలి ముందుకుసాగండి. మూడ్ స్వింగ్స్ కారణంగా సంబంధాలలో సమస్యలు ఉండవచ్చు. కార్యాలయంలో పనిని సులభంగా నిర్వర్తించగలుగుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆస్తికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సన్నిహితులు మీకు సహాయం చేస్తారు.  


ధనస్సు రాశి
పాత ఆస్తి నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్త ఆస్తుల కొనుగోలు పనులు సులభంగా పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అఖండ విజయం సాధిస్తారు. ఒంటరి వ్యక్తులు ప్రత్యేకంగా ఎవరినైనా కలుస్తారు. 


Also Read: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!


మకర రాశి
ఆదాయాన్ని పెంచే ఇతర వనరులను సృష్టించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అందుకుంటారు. వృత్తి జీవితంలో విజయాల మెట్లు ఎక్కుతారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు లేదా కుటుంబ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. 


కుంభ రాశి
ఈ రాశివారికి ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజు. ఆస్తికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. వైవాహిక జీవితం బావుంటుంది. భాగస్వామి భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండాలి. సంబంధంలో సమస్యలను విస్మరించవద్దు. 


Also Read: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!


మీన రాశి
ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తీరి సంపద పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో పురోగమిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆస్తిని విక్రయించడం లేదా అద్దెకు ఇవ్వడం వల్ల లాభపడతారు. 


Also Read: మే 14న వృషభ రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.