Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రాశివారికి ఈరోజు శుభదినం. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
వృషభ రాశి
ఈ రోజు మీకు అనకూల ఫలితాలు లేవు. బంధువులతో విభేదాలు రావచ్చు. మొండి వైఖరిని అవలంబించకుండా ఉండాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు.
మిథున రాశి
ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. తలనొప్పితో ఇబ్బంది పడతారు. మైగ్రేన్ రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణం సమయంలో వాహనం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!
కర్కాటక రాశి
మీ బాధ్యతను ఇతరులపై రుద్దకండి. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. పనిలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఆదాయం వృద్ధి చెందుతుంది. సన్నిహితుల నుంచి ప్రయోజనం పొందుతారు.
సింహ రాశి
మీరు సామాజిక కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు. వివాదాస్పద విషయాలకు పరిష్కారం కనుగొనడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలుంటాయి. ఆర్థికంగా లాభపడతారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మాటపట్టింపులకు పోవద్దు. సమస్యలు పరిష్కరించుకోవడంలో సక్సెస్ అవుతారు. అనుభవజ్ఞుల సలహాల నుంచి మీరు ప్రయోజనం పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు కానీ లోలోపల ఏదో తెలియని భయం వెంటాడుతుంది. మిమ్మల్ని మోసంచేసేవారు మీ చుట్టూ ఉన్నారు జాగ్రత్త. కొత్త పనులు ప్రారంభించేందుకు తొందరపడొద్దు. పరిస్థితులకు తగ్గట్టుగా మీరు అడుగువేయాలి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు గతంలో పడిన కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆనందంగా ఉంటారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. జీవితం ఆనందంగా సాగిపోతుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి మంచి ఫలితం పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
Also Read: కుంభ రాశిలో శని తిరోగమనం - 140 రోజుల పాటూ ఈ రాశులవారిపై శని ప్రతికూల ప్రభావం!
ధనుస్సు రాశి
ఈ రోజు మీ ఆదాయం పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొన్ని మార్పులుంటాయి. స్నేహతులకు సమయం కేటాయిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది.
మకర రాశి
ఈ రోజు పాత విషయాల గురించి ఆందోళనలు ఉంటాయి. వైవాహిక జీవితంలో చికాకులుంటాయి. అతిగా ఆలోచించవద్దు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి గుడ్ న్యూస్ వింటారు.
కుంభ రాశి
ఈ రోజు మీ మానసిక స్థితి బావుంటుంది. కార్యాలయంలో మంచి పనితీరు కనబరుస్తారు. అతివిశ్వాసంతో తప్పులు చేసే అవకాశం ఉంది జాగ్రత్త పడండి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.
మీన రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంతో కలసి దూరప్రాంతం ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: మిథున రాశిలోకి సూర్యుడు - జూన్ 15 నుంచి జూలై 16 వరకూ ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే !
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.