Mega DSC Category Wise Details: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మెగా డీఎస్సీ అంశంపై కీలక ముందడుగు వేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52 ఉన్నాయి. 

మెగా డియస్సీ పోస్టుల వివరాలుమొత్తం పోస్డులు  - 16347స్కూల్ అసిస్టెంట్ - 7725యస్.జి.టి - 6371టి.జి.టి - 1781 పి.జి.టి - 286 ప్రిన్సిపల్స్ - 52పి.ఇ.టి - 132

గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం.. మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, స్కిల్ సెన్స్ పై చంద్రబాబు ఐదో సంతకం చేశారు.

ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద సంబరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద డీఎస్సీ ఆశావహుల సంబరాలు చేసుకున్నారు. నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి యువత పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సీఎంగా తొలిరోజే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు యువత ధన్యవాదాలు తెలిపారు.