AP Officer Vasudeva Reddy :  ఏపీ బేవరెజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.  బేవరేజెస్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి జరిగిందని.. కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్లారని ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ వాసుదేవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వాసుదేవ రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం కేసు విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది.


జగన్ సీఎం అయ్యాక రైల్వే  ట్రాఫిక్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన వాసుదేవరెడ్డి 


వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్నారు. అంతకు ముందు ఆయన రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉద్యోగిగా ఉండేవారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వానికి డిప్యూటేషన్ పై వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లో కీలక  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాత బ్రాండ్లేమీ అందుబాటులో లేకుండా చేయడం దగ్గర్నుంచి వైసీపీ నేతల డిస్టిలరీల నుంచి వచ్చే మద్యమే అమ్మేలా చూశారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో వాసుదేవరెడ్డిని  ఏపీబీసీఎల్ ఎండీ స్థానం నుంచి ఈసీ తప్పించింది. 


ఎమ్మెల్సీలతో జగన్ భేటీ - మండలిలో టీడీపీకి చుక్కలు చూపించాలని సూచన !


ఎన్నికల ఫలితాల తర్వాత ఫైళ్లు తరలిస్తున్నారని ఫిర్యాదు           


అయితే ఎన్నికల  ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు చోరీచేసి తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం మెుగులూరుకు చెందిన శివకృష్ణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లో ఆయన ఉంటున్న  ఓ ఖరీదైన విల్లాలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.  ఇంట్లో నిర్వహించిన సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలు లభించినట్లుగా తెలుస్తోంది.                    


ఇకపై జగన్‌పై మాట్లాడను - రఘురామ కీలక వ్యాఖ్యలు


ఏపీలో భారీ మద్యం స్కాం జరిగిందని టీడీపీ నేతల ఆరోపణ      


 వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు, వారి సన్నిహితులు కలిసి మద్యం తయారీ, దాన్ని కొనుగోలు చేయడం, సరఫరా చేయడం, అమ్మడంలాంటివన్నీ వారి అధీనంలోనే ఉంచుకొని భారీగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. జే బ్రాండ్ మద్యాన్ని అమ్మడం, దుకాణాల్లో క్యాష్ లావాదేవీల వెనుక వాసుదేవరెడ్డి హస్తం ఉందని.. అదో పెద్ద స్కామని అంటున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయనను సీఐడీ అధికారులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.