Daily Horoscope Today December 13th, 2023
మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రాశి విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వివాహిత వ్యక్తుల బంధం స్థిరపడుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ సలహా ఇవ్వకండి.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
అతి విశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితులు ఎవరైనా మీకు తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు. డబ్బు విషయంలో ఆందోళన పెరగవచ్చు. మీ కెరీర్ విషయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. దూర ప్రయాణం ప్లాన్ చేసుకుంటే ఆ ఆలోచన విరమించుకోవడం మంచిది.
మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మీరు మీ ప్రవర్తనలో మార్పును చూస్తారు. ఇంటి పెద్దలకు సంబంధించి దగ్గరి బంధువులతో వాగ్వాదం జరగొచ్చు. ముఖ్యమైన పనులు తప్ప ఇతర పనులు ప్రారంభించవద్దు. మీ తల్లిదండ్రులకు సేవ చేయండి. మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. ఆదాయం పెరుగుతుంది.
Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu) (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
కర్కాటక రాశి వారికి వ్యాపారంలో లాభం ఉంటుంది. ధన సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పనిని ఆలోచనాత్మకంగా ప్రారంభించండి. మీరు పెట్టుబడి పెట్టవచ్చు. రాజకీయ విషయాలపై వాదోపవాదాలు తలెత్తవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితుడితో కలిసి ప్రయాణం చేయవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.
కన్యా రాశి (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ముఖ్యమైన పని కోసం స్నేహితుడిని కలుస్తారు. కొత్త వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రయాణించే వాహనం ఇబ్బందికి గురిచేస్తుంది. ఆలోచించకుండా కొత్త ప్రణాళికలు అమలు చేయవద్దు. ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు.
Also Read: నవగ్రహాల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇబ్బందులు మొదలవుతాయో తెలుసా!
తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)(వృషభరాశి)
ఈరోజు సాధారణ రోజు అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు పనిలో నిర్లక్ష్యం వహించవద్దు.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రోజు మీకు ఏ పని చేయాలని అనిపించదు. మనసులో ఏదో బాధ ఉంటుంది. కొన్ని పనుల్లో నష్టం రావచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. స్త్రీలతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఈరోజు మీ పని ఏదో తెలియని అడ్డంకి కారణంగా ప్రభావితం కావచ్చు.
Also Read: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు తగ్గవచ్చు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని మూలాల నుంచి ప్రయోజనం పొందుతారు. సోదరులకు సహాయం చేస్తారు. మీరు రోజంతా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
మీరు మీ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు. ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులను పూర్తి చేయండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈ రోజు మంచి రోజు అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వృద్ధులకు సేవ చేయండి.
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుంభరాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేయడంతో సంతోషంగా ఉంటారు. ధనలాభం పొందే అవకాశం ఉంది.
Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కెరీర్ కి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి.