Impact of Navagraha Astrology: ఓ వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేది, నిర్ధేశించేది నవగ్రహాలే. నవ గ్రహాల సంచరించే స్థానాన్ని బట్టి...జాతకుడి ప్రతికూలత, అనుకూలతను నిర్ణయిస్తారు. మరి ఏ గ్రహం వల్ల ఎలాంటి ప్రతికూల ఫలితాలు వస్తాయో..ముఖ్యంగా ఎలాంటి అనారోగ్యానికి గురవుతారో ముందుగానే తెలుసుకోవచ్చంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ మేరకు ముందుగానే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటూ, గ్రహాల శాంతికి దానాలు, శాంతి చేసుకోవచ్చని సూచిస్తున్నారు. 


Also Read:  ఈ రోజు కార్తీక అమావాస్య - డిసెంబరు 13 పోలిస్వర్గంతో కార్తీకమాసం ముగింపు!


రవి( సూర్యుడు)
సూర్యడి సంచారం మంచి స్థానంలో లేనప్పుడు కంటికి సంబంధించిన వ్యాధులు, హృదయానికి సంబంధించిన రోగాలు, ఎముకల నొప్పులు, పార్శ్య నొప్పి, మనో వ్యధ, అతిసారం, తలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా సూర్యుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇవన్నీ తప్పవు. ఇలాంటి వారు నిత్యం ఆదిత్య హృదయం, నవగ్రహ స్త్రోత్రం చదువుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది.


చంద్రుడు
చంద్రుడు మనఃకారకుడు. అయితే చంద్రుడు మీ రాశి నుంచి 8,12 స్థానాల్లో ఉన్నప్పుడు...కంఠానికి,పొట్టకి సంబంధించిన వ్యాధులు బాధిస్తాయి. క్షయ, పాండురోగం, మనస్థిమితం లేకపోవడం, మనోధైర్యం కోల్పోవడం జరుగుతుంది. 


Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!


కుజుడు
కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ..అంటే 8 వ స్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకుడి పరిస్థితి అస్సలు బావోదు. మూత్ర కోశం ఇబ్బందులు, చెవి పోటు, ఒంటిపై పొక్కులు, కుష్టు సంబంధిత వ్యాధులు, వాహన ప్రమాదాలు,ఎముకలు విరగడం, సోదరులతో వివాదాలు ఎదుర్కోక తప్పదు.


బుధుడు
బుధుడు 8,12 స్థానాల్లో ఉన్నప్పుడు నాలుకకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి.పైల్స్, పొట్టకు సంబంధించిన వ్యాధులు వెంటాడతాయి. పాండు రోగం, కుష్టురోగం వచ్చే ప్రమాదం ఉంది


గురుడు (బృహస్పతి)
దేవగురు బృహస్పతి అష్టమంలో ఉంటే మెదడు, ఊపిరితిత్తులుకు సంబంధించిన రోగాలు వస్తాయి. ఈ సమయంలో ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు..పేగులకు సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పెడతాయి.


శుక్రుడు
శక్రుడు శుభస్థానంలో ఉంటే ఎంత మంచి జరుగుతుందో...శుక్రుడు 8,12 స్థానాల్లో ఉంటే మూత్ర రోగం, మధుమేహం,పైత్య రోగం, సుఖ రోగాలు, రక్తదోషం, వ్యసనం, ఇంద్రియరోగాలతో బాధపడతారు.


శని 
ఏ గ్రహం వల్ల జరిగే నష్టాలు తెలిసినా తెలియకపోయినా కానీ శనిగ్రహం అంటే మాత్రం భయపడతారంతా. ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని....శని మూడు రకాలుగా ఇబ్బంది పెడుతుంది. శని వెంటాడుతున్న సమయంలో కాలేయ సంబంధిత రోగాలు, మనో వ్యధ, నరాల బలహీనత ఉంటుంది. శని బాధల నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ.. శివుడిని, ఆంజనేయుడిని, శనిని పూజిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది.


రాహువు
రాహు సంచారం అనుకూలంగా లేకపోతే... మతిభ్రమణం, పిశాచ బాధలు, పాముల నుంచి భయం, చర్మ సంబంధ రోగాలు , రక్తంలో నీరు చేరడం, ఉబ్బసం వెంటాడతాయి. 


కేతువు
కేతువు 8, 12 స్థానంలో సంచరిస్తున్నప్పుడు శారీరకబాధలు, నీరసం, నిస్సత్తువ, చర్మ వ్యాధులు ఇబ్బంది పెడతాయి.


Also Read: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !


నవగ్రహ స్తోత్రం


శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||


చంద్రుడు 
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||


కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||


బుధుడు 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||


గురుడు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||


శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||


శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||


రాహువు
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||


కేతువు
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||


Also Read: డిసెంబరు 12 మంగళవారం ఈ రాశులవారికి అనుకూలం!