Horoscope Today 12th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ప్రణాళికలు అమలుచేయడానికి ఈ రోజు మంచి రోజు. ఎవరికీ వాగ్ధానాలు చేయొద్దు. ఊహించని విధంగా ఖర్చులు పెరగడం మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. మీ ప్రియమైన వారితో జాగ్రత్తగా మాట్లాడండి లేదంటే పశ్చాత్తాపపడవలసి రావొచ్చు. వైవాహిక జీవితంలో కొంత గోప్యత అవసరం.
వృషభం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి.మీ జీవిత భాగస్వామి నుంచి మీకు సహకారం అందుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీలో చాలా సానుకూల మార్పును తీసుకురాగలదు.
మిథునం
డబ్బుపరంగా ఇబ్బందులుండవు. మీకు మనశ్సాంతి లభిస్తుంది. ఏ పని చేయాలి అనుకున్నా తక్కువ సమయంలో పూర్తిచేస్తారు. మీ ప్రియమైనవారికి దూరంగా ఉన్నప్పటికీ వారి ఉనికిని ఫీలువుతారు. స్నేహితులు కుటుంబ సభ్యుల కారణంగా ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి చాలా ప్రయత్నిస్తారు.
Also Read: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!
కర్కాటకం
చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. మీ సానుకూల ఆలోచనకు ప్రతిఫలం లభిస్తుంది. కార్యాలయంలో మీ పనిని మెచ్చుకోవడం వల్ల ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా నష్టాలున్నాయి...లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
సింహం
ఈ రోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ అవగాహనతో నష్టాన్ని లాభంగా మార్చుకోవచ్చు. వ్యాపార భాగస్వాములు సహకరిస్తారు . పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
కన్య
నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు మంచి రోజు కాదు. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. కార్యాలయంలో మంచి అనుభూతి పొందుతారు. మీ సహోద్యోగులు మీ పనిని అభినందిస్తారు. ఉన్నతాధికారులు కూడా మీ పనితీరు విషయంలో సంతోషిస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు.
తుల
కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు. ఉల్లాసమైన స్వభావం ఇతరులను సంతోషంగా ఉంచుతుంది. వ్యాపారానికి సంబంధించి ఇంటి నుంచి బయటకు వెళ్లే వ్యాపారవేత్తలు, ఈరోజు తమ డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేరే వ్యక్తి కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితుల అనుగుణంగా అడుగేయండి.
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి, ఏ రోజు ఏం చేయాలి, ప్రాముఖ్యత ఏంటి!
వృశ్చికం
మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మీ మనసులో ఏదైనా టెన్షన్ ఉంటే మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి. మీ ప్రియమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం వల్ల ఏమీ రాదు. ప్రశాంతంగా ఉండేందుకు ట్రై చేయండి. మీ మనసులో భావాలను మీ జీవిత భాగస్వామికి చెప్పడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనస్సు
మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. సంతోషంగా ఉండేందుకు సమయం కేటాయిస్తారు. ఉద్యోగులకు సీనియర్ల సహకారం ఉంటుంది. సమయం కన్నా ఏదీ ముఖ్యం కాదని తెలుసుకోండి. కుటుంబం కోసం సమయం వెచ్చించండి.
మకరం
ఆందోళనను విడిచిపెట్టి ముందుకు సాగండి. అనుకోని ఖర్చులుంటాయి జాగ్రత్త. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సమస్యలను ఇతరులపై రుద్దొద్దు. వేరేవారి విషయాల్లో తలదూర్చవద్దు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది.
కుంభం
మీకు ఏది ఉత్తమమో మీకు మాత్రమే తెలుసు..కాబట్టి మీ నిర్ణయం మీరు తీసుకోండి...దానివల్ల వచ్చే పరిణమాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపార ప్రణాళికలు వేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం
మీనం
మీలో అభద్రతా భావం కారణంగా గందరగోళంలో కూరుకుపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే పని చేయండి. మీ కుటుంబ సభ్యుల అవసరాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ సమస్యలను వదిలి జీవిత భాగస్వామితో సంతోష సమయం గడపండి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.