తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. బీఈ/బీటెక్/బీకామ్/హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. వాక్‌ఇన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అభ్యర్థులకు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి.
వివరాలు..
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 273 పోస్టులు
అప్రెంటిస్ వ్యవధి: ఏడాది.
విభాగాలవారీగా ఖాళీలు: ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్-15, కెమికల్ ఇంజినీరింగ్-10, సివిల్ ఇంజినీరింగ్-12, కంప్యూటర్ సైన్స్/ఇంజినీరింగ్-20, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-12, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-43, మెకానికల్ ఇంజినీరింగ్-45, మెటలర్జి-06, ప్రొడక్షన్ ఇంజినీరింగ్-04, ఫైర్ & సేఫ్టీ ఇంజినీరింగ్-02, హోటల్ మేనేజ్‌మెంట్/క్యాటరింగ్ టెక్నాలజీ-04, బీకామ్ (ఫైనాన్స్ & టాక్సేషన్)-25, బీకామ్(కంప్యూటర్ అప్లికేషన్)-75.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీకామ్/హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 30.10.2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ద్వారా.
స్టైపెండ్: రూ.9000.
వాక్‌ఇన్ తేదీ: 15.10.2022.
సమయం: ఉ.9.30 గం. - సా.5.00 గం.
ఇంటర్వ్యూ వేదిక:
Govt. Polytechnic College,
Kalamassery, Ernakulam Dist, Kerala.
:: Also Read ::
IRCTC: ఐఆర్‌సీటీసీలో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండియన్ రైల్వే కేటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతిలో 50 శాతం మార్కులతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Railway Jobs: సదరన్ రైల్వేలో 3154 అప్రెంటిస్ ఖాళీలు, ఐటీఐ అర్హత!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
కోల్‌కతాలోని తూర్పు రైల్వే , రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్సు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..