భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ ‌రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి.


వివరాలు...


* అప్రెంటిస్‌షిప్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 3154


1) క్యారేజ్ & వ్యాగన్ వర్క్‌షాప్ - పెరంబూర్: 1343 


2) సెంట్రల్ వర్క్‌షాప్/పొన్‌మొలై, తిరుచ్చి: 527 


3) సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్-పొదనూర్: 1284 


విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్‌, మెషినిస్ట్‌, వైర్‌మెన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, బ్లాక్ స్మిత్, బ్రిక్ లేయర్, రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కోపా, డ్రాట్స్‌మ్యాన్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, ఐసీటీఎస్ఎమ్, SSA.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంధిత స్పెలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.


వయసు:  15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.


స్టైపెండ్: నెలకు రూ.5500-రూ.7000 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్‌ మెరిట్‌, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తు చివరి తేది: 31.10.2022.


 


Notification-1 (Carriage & Wagon Workshop/ Perambur)


Notification-2 (Central Workshop/ Ponmalai, Trichy)


Notification-3 (S&T Workshop / Podanur)

Online Application



ఇవీ చదవండి..


SSC CGL Notification 2022: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి

ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



ఓఎన్‌జీసీలో 871 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, అదిరిపోయే జీతం, ఈ అర్హత తప్పనిసరి!
డెహ్రాడూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) గేట్ స్కోర్-2022 ఆధారంగా ఇ-1 స్థాయిలో ఇంజినీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్-2022 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. బీఎస్సీ, బీఈ, బీటెక్ , డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో గేట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించి అక్టోబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...