BRS AP Chief : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంతా కేసీఆర్ కొత్త పార్టీపై చర్చే. తెలంగాణలోనే పరిస్థితి కష్టంగా ఉందని చెబుతూంటే జాతీయ పార్టీపై కేసీఆర్ ఎందుకు కేసీఆర్ అంత తొందరపడుతున్నానే దగ్గర్నుంచి కొనబోతున్న సొంత వరకూ పార్టీ విశేషాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్‌తో నడిచే వారెవరన్నదానిపై అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎవరూ బయటపడలేదు. ఆయనతో కలిసి పని చేసేందుకు వచ్చే వారెవరన్నదానిపై ఏపీలోనూ చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనతో కలిసి పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేతలకు తన పార్టీలో కీలక బాధ్యతలివ్వాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఏపీలో మంచి అవకాశాలున్నాయని కేసీఆర్ భావన !
కేసీఆర్ జాతీయ పార్టీపై ఇప్పటికే రాష్ట్రాల వారీగా సుదీర్ఘ కసరత్తు చేశారు. అందులో ఏపీ కూడా ఉంది. సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో భారతీయ రాష్ట్ర సమితికి మంచి అవకాశాలు ఉంటాయని కేసీఆర్ నమ్ముతున్నారు. అయితే అక్కడ ఓ మంచి లీడర్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఆ లీడర్ ఎవరన్నదానిపైనే ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి మారీ సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏపీ అధ్యక్షుడు అయనే అన్న చర్చ జరిగింది. కానీ ఉండవల్లి మాత్రం ఆ చర్చ పెరగకుండా వెంటనే ఖండించారు. మరోసారి కేసీఆర్ .. ఏపీ నేత ఎవరూ భేటీ కాలేదు. అయితే తనతో పాటు టీడీపీలో పని చేసి .. యాక్టివ్‌గా లేని నేతలతో ఆయన మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చాలా మందికి కేసీఆర్ ఫోన్లుచేశారని ఏపీ రాజకీయవర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
బలమైన ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకునే సామాజికవర్గ నాయకుడికి అవకాశం !
ఏపీలో సామాజికవర్గ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఈ కారణంగా ఓ బలమైన సామాజికవర్గాన్ని మద్దతుగా మల్చుకుంటే తన జాతీయ పార్టీకి ఓటు బ్యాంక్ ఏర్పడుతుందని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన వారిని ఎక్కువగా సంప్రదిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎవరు కేసీఆర్ పార్టీ పట్ల ఆసక్తి చూపుతున్నారన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఖచ్చితంగా ఓ బలమైన నేతనే.. కేసీఆర్ పార్టీకి ఏపీలో సారధ్యం వహిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ నేత ఎవరు అన్నదానిపై మాత్రం సీక్రెసీ కొనసాగుతోంది.
ఏపీ నుంచి తమకు ఆహ్వానాలున్నాయంటున్న కేసీఆర్
ఖచ్చితంగా ఏపీలో అడుగు పెడతామని కేసీఆర్ చాలా రోజులుగా చెబుతున్నారు. ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తమను చాలా మంది పిలుస్తున్నారన్నరు. అప్పుడేదో ఆషామాషీ అని కొంత మంది అనుకున్నారు. కానీ కేసీఆర్ జాతీయ పార్టీపై స్పష్టతతో ఉన్నారని.. అందుకే తాము ఏపీలోకి వస్తామని చెప్పారని ఇప్పుడు క్లారిటీ వస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలు చేసినప్పటి నుండే ఏపీలో ప్రభుత్వ పరిపాలనపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో పాలన దారుణంగా ఉందని ఇటీవల టీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే అంటున్నారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్లాన్ ప్రకారమే.. కేసీఆర్ తన భారత రాష్ట్ర సమతిని ఏపీలో విస్తరించాలనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాలు వేరు.. ఏపీ వేరు.
అయితే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం వేరు.. ఏపీలో విస్తరించడం వేరు. ఎందుకంటే తెలంగాణతో ఏపీకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నీటి దగ్గర్నుంచి కరెంట్ బకాయిల వరకూ ఈ సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి వివాదాలు పెట్టుకుని అదీకూడా టీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలంగాఉన్న సమయంలో ఏపీ నుంచి ఎవరైనా.. కేసీఆర్‌తో కలుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే అసాధ్యం మాత్రం కాదు.