Bigg Boss 6 Telugu: ఈ రోజు ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా మారింది. ‘బ్యాటరీ రీఛార్జ్’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో ఇంటి సభ్యులకు తమ కుటుంబసభ్యుల నుంచి సర్ ప్రైజ్ గిఫ్టులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇక ఎపిసోడ్ లో ఏముందంటే...
నామినేషన్లు అయ్యేసరికి ఉదయం మూడున్నర అయింది. ఆ తరువాత అందరూ నామినేషన్ల గురించే మాట్లాడుకుంటూ కనిపించారు. కీర్తి , ఫైమా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీసత్య తన గురించి అలా అనడం నచ్చలేదని, తాను ఇనయా గురించి చాలా పెద్ద మాట అందని, ఆ విషయం చెబితే ఇనయా శ్రీసత్యను చెప్పుతో కొడుతుందని అంది. రాజశేఖర్ కూడా గీతూ గురించి ఇనయా, సూర్య దగ్గర కూర్చుని బాధపడ్డాడు. అందరూ నిద్రపోయారు. ఉదయం ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటతో నిద్రలేపాడు బిగ్‌బాస్. ఫ్లాప్ డ్రెస్సులు వెనక్కి తీసుకుని వారి వారి సూట్ కేసులు వెనక్కి ఇచ్చేశారు.
బ్యాటరీ రీచార్జ్ టాస్కు
దాదాపు నెలన్నరగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఇంటి సభ్యులకు కొన్ని సర్‌ప్రైజ్ గిఫ్టులు ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఇందులో భాగంగా గార్డెన్లో వందశాతం బ్యాటరీ నమూనాను ఉంచారు. సర్‌ప్రైజ్ గిఫ్టులను ఇంటిసభ్యులు తీసుకుంటే ఆ బ్యాటరీలో కొంత శాతం తగ్గుతుంది. అలాగే ఇంటి నియమాలను ఉల్లంఘించినా కూడా బ్యాటరీ రీఛార్జ్ తగ్గిపోతుంది అని చెప్పాడు బిగ్ బాస్. మొదట శ్రీహాన్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్.‘మీ నాన్న గారితో వీడియోకాల్ మాట్లాడటానికి 35 శాతం బ్యాటరీ ఉపయోగించాలి, సిరి నుంచి ఆడియో మెసేజ్ పొందాలంటే 30 శాతం బ్యాటరీ, ఇంటి నుంచి మటన్ బిర్యానీ తెప్పించుకోవాలంటే 15 శాతం బ్యాటరీ వాడాలి’ అని చెప్పాడు బిగ్ బాస్. శ్రీహాన్ తాను ఏదీ వాడకూడదని అనుకుంటున్నట్టు చెప్పాడు. దానికి బిగ్‌బాస్ ‘టాస్క్‌లో పాల్గొనకూడదని అనుకుంటే బయటికి వెళ్లచ్చు, తరువాతి పర్యవసానాలు ఇల్లు మొత్తం ఎదుర్కోవలసి వస్తుంది’ అని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్ ఫుడ్ ఎంచుకున్నాడు. కేవలం 15 శాతం మాత్రమే వాడాడు. దీంతో బయట ఉన్న బ్యాటరీ వంద నుంచి 85 శాతానికి పడిపోయింది.
తరువాత సుదీపను పిలిచాడు బిగ్‌బాస్. భర్త ఆడియో కాల్ మాట్లాడేందుకు 30 శాతం, టీ షర్టు కోసం 40 శాతం, అమ్మ చేసిన చికెన్ బిర్యానీ కోసం 35 శాతం బ్యాటరీని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పాడు. దీంతో సుదీప బాగా ఏడ్చింది. తరువాత ఆడియో కాల్ ఆప్షన్ ఎంచుకుంది. భర్తతో ఫోన్ మాట్లాడింది. శ్రీహాన్‌కు ఇంటి నుంచి మటన్ బిర్యానీ, మటన్ కర్రీ వచ్చింది. వాటిని అందరికీ పంచాడు.
భార్య కూతురితో వీడియో కాల్...
ఆదిరెడ్డి 40 శాతం బ్యాటరీని వాడుకున్నాడు. భార్యాకూతురితో వీడియో కాల్ మాట్లాడాడు. వీడియో కాల్‌లో భార్య కవిత, కూతురి హద్వితను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. కవిత భర్తతో మాట్లాడుతూ ‘ఒకప్పుడు బిగ్ బాస్‌కి వెళ్లొద్దని చెప్పాను. కానీ ఇప్పుడు చెబుతున్నా నువ్వు వెళ్లినందుకు చాలా గర్వపడుతున్నా. నీ వైపు తప్పులేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేయి. నాగార్జున్ సర్ చెప్పినట్టు కామన్ మ్యాన్ రివ్యూవర్ అయ్యాడు, రివ్యూవర్ కంటెస్టెంట్ అయ్యాడు... కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్ బిగ్‌బాస్ విన్నర్ అయ్యాడు. విన్నర్ అయ్యి రావాలి, ఈ మూడు నెలలు మేము ఎందుకు మిస్సయ్యాం అనే దానికి నువ్వు విన్నర్ అయి రావడమే సమాధానం’ అని చెప్పింది కవిత. ఆదిరెడ్డి కూతురిని, కవితను చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.
Also read: ముందు ఏడిపించేసిన బిగ్‌బాస్, తరువాత మాత్రం ఇంటి సభ్యులకు అంతులేని ఆనందం