Horoscope Today 12th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి 
ఈ రోజు ఈ రాశివారు రియల్ ఎస్టేట్ లో అదనపు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. మీ సోదరుడి నుంచి సహకారం తీసుకోండి. ఏదైనా వివాదాన్ని మాటల ద్వారా పెంచేబదులు స్నేహపూర్వక మార్గంలో పరిష్కరించడానికి ప్రయత్నించండి. దీర్ఘకాలిక వ్యవహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి


వృషభ రాశి 
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. మీరు  కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. స్నేహితులు , సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు.


మిథున రాశి
ఈ రోజు మీరు ఏ పని ప్రారంభించినా ఆశించిన విజయాన్ని పొందుతారు. వ్యాపారం పురోగతి ఉంటుంది. మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి..కోపాన్ని నియంత్రించండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


Also Read: ఈ రాశివారికి గతవారం కన్నా ఈ వారం ఉపశమనం, మేషం నుంచి కన్యా వారఫలాలు


కర్కాటక రాశి 
అకాస్మాత్తుగా ధనలాభం పొందుతారు. మీ ఖర్చులు, బిల్లులు క్లియర్ అవుతాయి. మొండిగా  ప్రవర్తించి ఇతరులను బాధించవద్దు. మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంట్లో ఒత్తిడి ఏర్పడుతుంది. మీకు తెలియని శత్రువుల నుంచి మీపై పుకార్లు షికార్లు చేస్తాయి


సింహ రాశి
ఈ రోజు మీకు మామూలుగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. పనిని పూర్తి చేయడానికి మీకు తగినంత సమయం లభించదు. దానిపై టెన్షన్ పడేకన్నా సహనంగా పనిచేయండి. కొంతమంది మీకు సహాయం చేయడానికి కూడా సందేహించవచ్చు.


కన్యా రాశి
ఈ రోజు మీరు మీ శత్రువుపై విజయం సాధిస్తారు. కన్య రాశివారు ఈ రోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.


తులా రాశి
వ్యక్తిత్వ వికాసంలో మీకు మీరే గురువు. మీ తెలివితేటలు ఉపయోగించుకుంటే మరింత మెరుగ్గా మారుతారు. గ్రూపుల్లో పనిచేయడంపై ఆసక్తి చూపించండి...తద్వారా మీరు మరింత మెరుగ్గా మారగలరు.  మీరు ఇతరులపై ఖర్చు చేయడం ఆపకపోతే కుటుంబ జీవితంలో ఇబ్బందులు తప్పవు


Also Read: ఈ రాశివారికి గుడ్ టైమ్ స్టార్ట్ అయింది, తులా నుంచి మీనం వార ఫలాలు


వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు ఏదైనా పెద్ద పనిలో విజయం సాధిస్తారు. కాస్మెటిక్ వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారంలో భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది.


ధనుస్సు రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో డబ్బు సంపాదిస్తారు. ఈ రోజు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో ఉన్న సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి. బంధాలకు పూర్తిగా అంకితమవుతారు


మకర రాశి 
ఈ రోజు ఆరంభంలో కన్నా రోజు గడిచేకొద్దీ బావుంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు మంచి రోజు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు


కుంభ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఏదో  సృజనాత్మక పనిలో నిమగ్నమవుతారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది. అధికారులు మీ పనితో సంతోషంగా ఉంటారు. మీ సలహా అవసరం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.


మీన రాశి 
ఈ రోజు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. పనిలో సీనియర్ అధికారులతో సమన్వయం బాగుంటుంది. మీ రంగంలో మరింత మెరుగ్గా రాణిస్తారు. ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మీరు ఊహించిన దానికంటే ప్రతిదానిలో ఎక్కువ విజయాన్ని పొందుతారు.