Horoscope Today 10th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీ కన్నవారి పట్ల ఉన్న ప్రేమను బహిరంగంగా తెలియజేస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో కోపంగా కనిపిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఈ రాశి ఉద్యోగులు సక్సెస్ అవుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు లాభపడతారు
మిథున రాశి
ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బు అందుతుంది. అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం ఉంటుంది. నిలిచిన పోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
Also Read: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు
కర్కాటక రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆస్తుల కొనగోలు దిశగా అడుగులు ముందుకేస్తారు.
సింహ రాశి
ఈరోజు ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఏదో విషయంలో వాగ్వాదం జరగవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు.
కన్యా రాశి
ఈ రోజు కన్యారాశి వారి కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.ఏదైనా పని కొత్తగా ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోండి
తులా రాశి
ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. పనుల్లో బిజీగా ఉంటారు. రోజంతా గడిచిపోయినట్టే అనిపిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు.
వృశ్చిక రాశి
ఈ రోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సాయంత్రానికి కొన్ని శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి మతపరమైన ప్రదేశాలకు వెళ్లవచ్చు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ధనుస్సు రాశి
ఈ రోజు మీ కీర్తి పెరుగుతుంది. చాలా కాలంగా కొనసాగుతున్న అన్ని రకాల సమస్యలు తీరనున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి జరుగుతుంది. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
మకర రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారానికి సంబంధించి చేసే పనుల్లో విజయం సాధిస్తారు.వైవాహిక జీవితంలో ప్రేమ ఆకర్షణల పెరుగుతుంది
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కుంభ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. క్షేత్రస్థాయిలో మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తి కానున్నాయి.
మీన రాశి
ఈ రోజు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేయవచ్చు. కొన్ని సంఘటనల విషయంలో మీరు కాస్త తగ్గాల్సి ఉంటుంది. ఈ రోజంతా సంతృప్తిగా గడుస్తుంది
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి