Horoscope Today 03 September 2023


మేష రాశి


ఈ రాశివారు ఈ రోజు కొన్ని విషయాల్లో ఈ రోజు బాధపడతారు. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారం మెరుగుపడుతుంది. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు, అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. 


వృషభ రాశి


ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తమపట్ల తమకి పూర్తి విశ్వాసం ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అదనపు ఖర్చులు ఉంటాయి. స్నేహితుని సహాయంతో ఉద్యోగం పొందవచ్చు. మాటలో సౌమ్యత ఉంటుంది.  పూర్వీకుల ఆస్తి నుంచి ఆర్థిక లాభం ఉండవచ్చు. పిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. 


మిథున రాశి


ఈ రాశివారు కాస్త ఓపికగా వ్యవహించాలి.  ఏదో విషయంలో మనస్సు కలవరపడవచ్చు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పరిష్కరించుకునే దిశగా సాగండి. జీవితం బాధగా సాగుతుంది. తల్లికి అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. 


Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు! 


కర్కాటక రాశి


ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఏదో విషయంలో మనసు కలత చెందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం తగ్గడంతోపాటు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు ఇతర విషయాలపై కాకుండా చదువుపై శ్రద్ధ వహించండి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మాటల్లో సౌమ్యత ఉంటుంది. ఓ స్నేహితుడిని కలుస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 


సింహ రాశి


ఈ రాశివారికి ఈ రోజు కాస్త గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు ఎదురైన ఆంటకాలు అధిగమించేందుకు ధైర్యంగా ముందుగా సాగండి. స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కళలు, సంగీతం పై శ్రద్ధ పెడతారు. వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నం సఫలం అవుతుంది. 


కన్యా రాశి


ఈ రాశివారి మనసులో నిరాశ, అసంతృప్తి ఉండవచ్చు. ఉద్యోగం మారాలి అనుకున్నా ఇదే సరైన సమయం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. క్షణికావేశం తగ్గించుకోవడం మంచిది. మతపరమైన పనులలో నిమగ్నమై ఉంటారు.


తులా రాశి


ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. మనసులో ఆశ,నిరాశ రెండూ ఉంటాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. తీపి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో అనవసర ఒత్తిడి తీసుకోవద్దు. మీరు తలపెట్టే పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మాటతీరులో కర్కశత్వం రానివ్వకండి. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. 


Also Read: ద్వారక సముద్రంలో మునిగినప్పుడు మిస్సైన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు ఎక్కడుందంటే!


వృశ్చిక రాశి


ఈ రాశివారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యా, మేధోపరమైన పనిలో గౌరవం పొందుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. పాత స్నేహితులను కలుస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 


ధనుస్సు రాశి


ఈ రాశివారు సహనంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు స్థాన చలనం ఉండొచ్చు. అనుకోని శ్రమ పెరుగుతుంది. విద్యా,పరిశోధన రంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. శ్రమ పెరుగుతుంది. మనసులో నిరుత్సాహం, అసంతృప్తి ఉంటాయి.


మకర రాశి


ఈ రాశి ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. రాజకీయ నాయకులకు శుభసమయం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. 


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి! 


కుంభ రాశి


ఈ రాశివారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నించండ మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీ స్వభావంలో ఏదో చిరాకు ఉంటుంది కానీ మాటలో సౌమ్యత అలాగే ఉంటుంది. వివాదానికి దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఏదో విషయంలో విభేదాలు రావొచ్చు.


మీన రాశి


ఈ రాశివారు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. అనుకోని శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. వాహన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆ క్షణమే కోపం వస్తుంద ఆ క్షణమే తగ్గుతుంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తోబుట్టువుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. 


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.