జనవరి 19 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు భాగస్వామ్య వ్యాపారంలో బాగా కలిసొస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవచ్చు. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు.  


వృషభ రాశి


ఈ రోజు మీరు డబ్బుకి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. అనవసర కోపం తెచ్చుకోవద్దు. మీ ప్రతిభను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రేమ సంబంధాల్లో బాధే మిగులుతుంది. 
 
మిథున రాశి


మీకు సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. ప్రయాణంలో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయొద్దు.  నిరుద్యోగులు ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతారు. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.


Also Read: జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు తేదీలివే!


కర్కాటక రాశి 


ఈ రోజు మీ శారీరక సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞానవంతులతో పరిచయం ఏర్పడుతుంది.  కార్యాలయంలో రిస్క్ తీసుకోవాలనుకుంటే, ఈ రోజు చాలా శుభప్రదమైనది. వ్యాపార ఒప్పందాలకు సమయం చాలా మంచిది. 


సింహ రాశి


ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యాపార సంబంధిత విషయాలకు అనుకూలమైన రోజు. ఆహారంలో స్వచ్ఛత ,  పోషణపై శ్రద్ధ వహించండి. మీరు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త. మాటల్లో మర్యాదను పాటించండి. వైవాహిక జీవితం  బాగుంటుంది.
 
కన్యా రాశి


మీరు ఈ రోజు విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఈ రోజు చాలా బాగుంది. వివాదాస్పద విషయాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి.


తులా రాశి


ఈ రోజు ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ మీరు తప్పుడు మార్గాలను ఎంచుకోవడం మానుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ మనోభావాలను దెబ్బతీస్తారు. ఈ రోజు తీవ్రమైన విషయాలపై అనవసర చర్చ చేయవద్దు. 


వృశ్చిక రాశి
 
ఈ రోజు మీరు కొన్ని విషయాల గురించి బాధపడతారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రత్యేకంగా అనుకూలమైన రోజు. అదృష్టం మీ వైపు ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రవర్తనతో ప్రజలు సంతోషిస్తారు.  దిగుమతి-ఎగుమతి సంబంధిత వ్యాపారం నుంచి లాభం పొందవచ్చు


Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!


ధనుస్సు రాశి


ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు కొన్ని పనుల్లో గొప్ప విజయాన్ని పొందుతారు. ఒప్పందాలకు ఈ రోజు చాలా అనుకూలమైనది.  కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. మీ తెలివితేటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు పాత స్నేహితులను కలుస్తారు 


మకర రాశి


ఈ రోజు మీరు ఎప్పటి నుంచో నెరవేరని కోరికలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. ఇతరులతో పోల్చుకోవద్దు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. విద్యార్థులు తమ చదువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. 


కుంభ రాశి


ఈ రోజు మీరు కొందరి మాటలవల్ల  ఒత్తిడికి లోనవుతారు. ప్రేమ జంటలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు మార్కెటింగ్‌కు సంబంధించిన రంగంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ప్రేమ సంబంధాలకు ఈ రోజు శుభప్రదం.


Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి


మీన రాశి


ఈ రాశివారికి ఈ రోజు  ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ప్రశాంతంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన పనిని సమయానికి ముందే పూర్తి చేయడం మీ మనస్సును ఉత్తేజపరుస్తుంది. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.