Srisailam: జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో  శివరాత్రి బ్రహ్మోత్సవాలు తేదీలివే!

 Maha Shivaratri 2025: ఈ ఏడాది శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ఆలయ శ్రీనివాసరావు 

Continues below advertisement

Maha Shivaratri Brahmotsavam: జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నారు ఆలయ అధికారులు. ఈ మేరకు మహాశివరాత్రి ఏర్పాటపై సమీక్ష నిర్వహించారు ఈవో. ముఖ్యంగా మహాశివరాత్రి పూజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ అంశాలపై అధికారులతో చర్చించారు. 

Continues below advertisement

ఫిబ్రవరి 26 మహాశివరాత్రి (Maha Shivaratri 2025)

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి అయినప్పటికీ అంతకు వారం ముందు నుంచే భక్తుల సందడి మొదలవుతుంది. ఎందుకే ఈలోగానే ఏర్పాట్లన్నీ పూర్తికావాలని సూచించారు ఈవో శ్రీనివాసరావు. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించనున్న ప్రభోత్సవం, బ్రహ్మోత్సవ కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. శివదీక్షలో ఉండే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో ఉండే భక్తుల కోసం మంచినీరు, అల్పాహారం అందించాలని సూచించారు. భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని..ఈ మేరకు పారిశుధ్యం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సూచిక బోర్డుల ఏర్పాట్లపై శ్రద్ధ పెట్టాలన్నారు. 

Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!

మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడిపోతాయ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో శ్రీశైలం చాలా ప్రత్యేకం. సాధారణ భక్తులతో పాటూ శివమాల ధరించిన భక్తులు కూడా భారీగా తరలివస్తారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం నిర్వహించి పలు వాహన సేవలు చేస్తారు.  భృంగి వాహనసేవ, హంస వాహనసేవ, మయూర వాహనసేవ, రావణ వాహనసేవ, పుష్పపల్లకీ సేవ, గజ వాహనసేవ, మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం  ఉంటాయి. ఇంకా రథోత్సవం, తెప్పోత్సవం, యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కూడా నిర్వహిస్తారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో ఆలయ దర్శన విధానాల్లో కూడా కీలక మార్పులు చేసే అవకాశం ఉంది.

శివదీక్షలు వేసుకునేవారు శివరాత్రికి శ్రీశైల మహాక్షేత్రంలో దీక్ష విరమిస్తారు. అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల అయప్పను దర్శించుకుని దీక్ష విరమిస్తారు. భవానీ దీక్ష తీసుకునేవారు దసరా సమయంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దీక్ష విరమిస్తారు. సాధారంగా జనవరిలో శివదీక్షలు ప్రారంభమవుతాయి. శివదీక్ష చేపట్టడం ద్వారా ఈ జన్మలో కోరిన కోర్కెలన్నీ తీరిపోయి..మరణానంతరం ఆ పరమాత్ముడిలో ఐక్యం అయిపోయేలా చేసేందుకు ఈ శివదీక్ష ఉపయోగపడుతుంది.  జనవరిలో తీసుకునే శివదీక్షను శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో విరమిస్తారు..

Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి

శివ దీక్ష మాల ధారణ మంత్రం

ఓంకార శక్తి సంయుక్తం-సచ్చిదానంద రూపిణీం
శ్రీశైలేశదశాపూర్ణం -శివముద్రాం నమామ్యహం

శ్రీశైల శృంగ నిలయః సాక్షాత్తు శ్రీ మల్లికార్జునః
దీక్షా బద్ధ స్వరూపాంచ- ముద్రాం మే పాతు సర్వదా

శివ దీక్ష చేపట్టేవారు కొందరు చందనపు రంగుల బట్టలు ధరిస్తారు..మరికొందరు నీలపు రంగు వస్త్రాలు కూడా ధరిస్తుంటారు. అయ్యప్ప దీక్ష, భవానీ దీక్షలా శివదీక్షకు కూడా చెప్పులు వేసుకోకూడదు. ఈ సమయంలో క్షౌవరం చేయించుకోకూడదు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా శివపూజ చేయాలి. నుదుటన చందనం, విభూతి, కుంకుమ పెట్టుకోవాలి. రుద్రాక్షలు ధరించాలి. దీక్షా సమయంలో అనవసర చర్చల్లో పాల్గొనరాదు. ఎక్కువ మాట్లాడకూడదు..శివధ్యానంలో ఉండాలి. అయ్యప్ప భక్తులను స్వామి అని పిలిచినట్టే..శివ భక్తులను శివా అని పిలవాలని చెబుతారు. ఒక్కపూట భోజనం చేసి నేలపై నిద్రించాలి. 40 రోజుల దీక్ష తర్వాత శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుని దీక్ష విరమించాలి. శివదీక్ష  భక్తిశ్రద్ధళతో పాటించేవారికి  భూతప్రేత పిశాచ బాధలు నశించిపోతాయి . గ్రహదోషాలు తొలగిపోతాయి.  ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం లభిస్తుంది. 

Also Read:  తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!

Continues below advertisement