Tirumala Chaganti koteswararaoఏపీ ప్రభుత్వ సలహాదారు బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారికి తిరుమలలో అవమానం జరిగిందా?

ఆయనకు కేటాయించిన బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి ఎందుకు వెళ్లారు?

జనవరి 16న తిరుపతిలో ఇవ్వాల్సిన ప్రవచనం ఎందుకు రద్దు అయింది? 

చాగంటికి అవమానం అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏమన్నారు?

అసలేం జరిగిందంటే....

ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు (Chaganti koteswararao) ఏటా సంక్రాంతి పర్వదినం రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా జనవరి 14న శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అయ్యాక.. జనవరి 16వ తేదీ సాయంత్రం తిరుపతి  మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు  2024 డిసెంబర్ 20న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొసిడింగ్స్ ఇచ్చింది. 

చాగంటి కోటేశ్వర రావు గారికి ప్రస్తుతం ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు అధికారులు.  అందులో భాగంగా రాంబగీచ  గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి తీసుకెల్లేందుకు బగ్గీస్ ను...బయోమెట్రిక్ ద్వారా ఆలయానికి అనుమతించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది.

Also Read: తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!

వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ సున్నితంగా తిరస్కరించిన చాగంటి కోటేశ్వర రావు ..సాధారణ భక్తులతో పాటూ  వైకుంఠం కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్వయంగా ఆయనే వైకుంఠ కాంప్లెక్స్ కి వెళ్లి అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు.  

ఇక జనవరి 16న జరగాల్సిన ప్రవచనం మరో తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు అధికారులు..ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం (vaikunta dwara darshan tirumala) టోకెన్ల పంపిణీ కేంద్రంవద్ద జనవరి 8న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత చాగంటి ప్రవచనం కార్యక్రమాన్ని మరో తేదీన ఏర్పాటు చేద్దాం అని టీటీడీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయనకు సమాచారం అందించి..మరో తేదీన ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని ప్రవచనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?

జరిగిన సంఘటన ఇది అయితే.. దీనిపై మరో విధంగా ప్రచారం ప్రారంభించారు కొందరు నెటిజన్లు.

చాగంటివారు బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతించారని.. చివరి నిముషంలో ఆయన ప్రవచనం టీటీడీ రద్దు చేసిందని .. చాగంటి వారికి ఘోర అవమానం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం చూసిన టీటీడీ అధికారులు..వాస్తవాన్ని వివరిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!