Gemini Ugadi Panchangam 2025 April to 2026 March : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి మాస ఫలితాలు...
ఏప్రిల్ 2025
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్నిరంగాల వారికి యోగకాలం. పట్టిందల్లాబంగారం అన్నట్టుంటుంది. ఏ పనితలపెట్టినా పూర్తవుతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అన్ని వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. సంఘంలో ఉన్నత స్థానం పొందుతారు.
మే 2025
ఈనెలలో 12వ ఇంట గ్రహసంచారంకొంతమేర ఇబ్బందిపెడుతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అంతకుమించి ఉంటాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. కుటుంబంలో దుబారా ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి. అన్ని రంగాలవారూ ఆర్థికంగా ఇబ్బంది పడతారు.
జూన్ 2025
జూన్ నెలలో మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అంతా బావున్నట్టే అనిపిస్తుంది కానీ మానసిక ప్రశాంతత ఉండదు. అప్పులు చేయాల్సి వస్తుంది. నమ్మినవారివల్ల మోసపోతారు. సంతానం వల్ల చికాకులుంటాయి. అనారోగ్య సమస్యలు బాధపెడతాయి. మానసిక ఆందోళన, ఊహించని సంఘటనలు ఉంటాయి
జూలై 2025
ఈ నెల ఆరంభంలో సమస్యలుంటాయి కానీ రెండోవారం నుంచి పరిస్థితిలో మార్పుంటుంది. అన్ని రంగాలవారికి లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనసౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల రాక ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాల వల్ల లాభపడతారు.
మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఆగష్టు 2025
ఈ నెలలో అన్ని రంగాలవారికీ లాభదాయకమే. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో రాణిస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. వాహనసౌఖ్యం ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో లాభపడతారు. ఆరోగ్యం బావుంటుంది. మిత్రులతో కలసి సంతోష సమయం స్పెండ్ చేస్తారు. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది.
సెప్టెంబర్ 2025
మిథున రాశివారికి సెప్టెంబలులో వృత్తి వ్యాపారాల్లో అనుకూలత. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
అక్టోబర్ 2025
ఈ నెలలోనూ మీకు అన్నివిధాలుగా కలిసొస్తుంది. డబ్బు నిల్వచేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
నవంబర్ 2025
నవంబర్ నెల మిథున రాశివారిక మిశ్రమ ఫలితాలనిస్తుంది. చేపట్టిన పనులు ఆశించిన స్థాయిలో పూర్తికావు. మధ్యలో ఆగిపోతాయి, నష్టపోతారు. స్నేహితులతో వివాద సూచనలున్నాయి. భార్యభర్తల మధ్య తగాదాలు జరుగుతాయి కానీ సమసిపోతాయి. సంతానం కారణంగా చికాకులుంటాయి.
డిశంబర్ 2025
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం మీకు అన్నివిధాలుగా కలిసొస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యసనాల ద్వారా ధనవ్యయం అవుతుంది.
జనవరి 2026
కొత్త ఏడాదిలో అన్నింటామీదే పైచేయి. ఆనందంగానూ ఉంటారు. ఆర్థికంగా లాభపడతారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ సలహాలు ఎదుటివారికి మేలు చేస్తాయి. నూతనవస్తువులు , వస్త్రాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి.
ఫిబ్రవరి 2026
ఈ నెలలో మిథున రాశివారికి మిశ్రమఫలితాలుంటాయి. పనులు పూర్తవుతాయి కానీ డబ్బు ఖర్చుచేస్తారు. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. కోపం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి గాబరా పడతారు. వ్యవహారాల్లో నష్టపోతారు. ప్రయాణాల్లో నష్టాలుంటాయి. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. వస్తువులు పోగొట్టుకుంటారు.
మార్చి 2026
ఈ నెలలో మీకు కలిసొస్తుంది. ఆదాయం బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు.
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.