Happy Ugadi Rasi Phalalu 2025 2026 in Telugu: మేష రాశి నుంచి మీన రాశి వరకూ 12 రాశుల వార్షిక ఫలితాలు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు..
మేష రాశి
మేష రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గడిచిన ఏడాది కన్నా మెరుగ్గా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. మీ తెలివితేటలే మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తాయి ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వృషభ రాశి
ఈ రాశివారికి కొత్త ఏడాది అద్భుతంగా కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, నిర్మాణరంగం, విద్య...అన్ని రంగాల్లో ఉండేవారిని అదృష్టం వరిస్తుంది. వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మిథున రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశివారికి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. పెద్ద సమస్యలు ఉండవు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు అష్టమ శని నుంచి ఈ ఏడాది బయటపడతారు. ఫలితంగా గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగైన ఫలితాలుంటాయి. ఈ ఏడాది జూలై నుంచి మూడేళ్ల పాటు మీకు మంచి జరుగుతుంది. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశివారికి అష్టమ శని ప్రారంభమవుతుంది. ఇంకా జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు సంచారం కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది మీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిందే. (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కన్యా రాశి
కన్యా రాశివారికి ఈ ఏడాది మంచి ఫలితాలుంటాయి. గతేడాది వెంటాడిన కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
తులా రాశి
తులా రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. గురుబలం వల్ల జీవితం అద్భుతంగా సాగిపోతుంది. రాహువు కారణంగా అనుకోని ఇబ్బందులుంటాయి కానీ వాటిని ఎదుర్కొని దూసుకెళ్తారు. (తులారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు ఈ ఏడాది అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం పొందుతారు. గడిచిన ఏడాది కన్నా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి విశేష ఫలితాలున్నాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ( మీ రాశి ఉగాది 2025 ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
ధనస్సు రాశి
ధనస్సు రాశివారికి శ్రీ విశ్వావసు నామసంవత్సరంలో జూన్ కి ముందు ఓ లెక్క ఆ తర్వాత మరో లెక్క అన్నట్టుంటాయి పరిస్థితులు. జూన్ వరకూ గ్రహాల అనుకూల సంచారం అన్నింటా విజాయన్ని అందిస్తుంది. జూన్ తర్వాత అష్టమంలో గ్రహ సంచారం చిక్కులు తెచ్చిపెడుతుంది. (ఉగాది పంచాంగం 2025 ధనస్సు రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి )
మకర రాశి
మకర రాశివారికి ఈ ఏడాది అద్భుతమైన కాలం. ఏడున్నరేళ్లుగా ఏల్నాటి శనితో బాధపడిన ఈ రాశివారికి ఈ ఏడాది నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా కష్టాలన్నీ మబ్బులు వీడినట్టు తొలగిపోతాయి. చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కానీ పెద్ద గ్రహాల అనుకూలత మీకుంటుంది. (ఉగాది పంచాంగం 2025 మకర రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కుంభ రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశివారికి ఏల్నాటి శని ప్రభావం ఓ వైపు... రాహువు ప్రతికూల సంచారం మరోవైపు ఉంటుంది. ఫలితంగా స్థిమితంగా ఉండలేరు. కానీ గురుబలం ఉండడంతో సమస్యల నుంచి ఈజీగా నెగ్గుకొచ్చేస్తారు. ఉగాది 2025 మీ రాశి ఫలితాలు పూర్తిగా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మీన రాశి
కొత్త ఏడాది మీన రాశివారికి అడుగుకో పరీక్ష పెడుతుంది. ఏల్నాటి శని ఓవైపు, పన్నెండో స్థానంలో రాహువు మరోవైపు ఆడేసుకుంటారు. వినయ విధేయ రామలా నటించినా కానీ నెగ్గుకురావడం కష్టమే. మీన రాశి ఉగాది 2025 సంవత్సర ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి