Daily Horoscope Today Dec 05, 2023 : డిసెంబరు 5 న మేష రాశి నుంచి మీన రాశివరకూ ఫలితాలు...


మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొత్త పని చేయాలనే ఆలోచన వస్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ రోజు మంచిరోజు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. అవివాహితుల వివాహం కుదురుతుంది. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


ఏ విషయంలోనూ  తొందరపడకండి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సలహా పొందుతారు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు.  బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది. మేధో పని పట్ల మీ ఆసక్తి మేల్కొంటుంది. 


మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. కార్యాలయంలో ఉద్యోగుల సమర్థత పెరుగుతుంది. స్నేహితులు, తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు.


Also Read: ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!


కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశివారికి కుటుంబంలో సమన్వయంలో సమస్యలు ఉంటాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అనవసర పనుల్లో ఎక్కువ సమయం వృథా చేయకండి. లావాదేవీల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. తెలివితేటలను సక్రమంగా వినియోగించుకోండి.


సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఊపందుకుంటాయి. కష్టపడి పనిచేయడం వల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. పిల్లల విజయాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఈ రాశి స్త్రీల ఆరోగ్యం చాలా బాగుంటుంది.


కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


ఈ రాశివారికి పొట్టకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. పనికిరాని పనులకు సమయం వృధా చేయవద్దు. స్నేహితులు, సహోద్యోగులకు మీపై కోపం ఉంటుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 


Also Read: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!


తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


ఈ రాశివారి కుటుంబ జీవితం బావుంటుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. మార్కెటింగ్ సంబంధిత పనులలో భారీ ఆర్థిక లాభం ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులకు శుభసమయం. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది.


వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


ఈ రాశి ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోగలరు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా బాగుంటుంది. 


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


ఈ రోజు మీరు అతిథులను కలుస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులు కొత్త అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందుతారు. వ్యాపారంలో మీ లక్ష్యాలపై కొన్ని సందేహాలు ఉంటాయి. స్త్రీలు శుభవార్త వింటారు. 


Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023


మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


మీ ఆలోచనలు తప్పుడు మార్గంలో వెళ్లాలి అనుకుంటారు..ఓసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ రోజు మీరు కొన్ని అవమానకర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆధ్యాత్మి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 


కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఈ రాశివారిపై పెద్దల ఆశీస్సులుంటాయి. ప్రేమికులు భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి ఈ రోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. హోటల్ కి సంబంధించిన వ్యాపారం చేసేవారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. 


Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!


మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఈ రాశివారిలో ఏదో కొత్త శక్తి ఉంటుంది.  వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. దిగుమతి-ఎగుమతులకు సంబంధించిన వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొన్ని పాత విషయాల గురించి ఆలోచించి గందరగోళానికి గరవుతారు.


Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!