Astrology: కొందర్ని చూడగానే వీళ్లు మహా తెలినైనోళ్లు అనే కాంప్లిమెంట్ అందుకుంటారు. పుట్టుకతోనే తెలివితేటలు వీళ్ల సొంతం అని మరికొందర్ని చూస్తే అనిపిస్తుంది. తెలివి అంటే కేవలం చదువులో ముందుండడం, మంచి ఉద్యోగంలో స్థిరపడడం కాదు. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటినుంచి బయటపడం ఎలా, సమస్యల్ని పరిష్కరించడం ఎలా అన్నది అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగాలి. అది వారికోసం అయినా...తమవారికోసం అయినా. ఇలాంటి లక్షణాలు కొన్ని రాశులవారికి ఉంటాయట. ఆ రాశులేంటో చూద్దాం..
మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేషరాశివారి ఆలోచనలు చాలా వేగవంతంగా ఉంటాయి. నిర్ణయాలు ఎంత త్వరగా తీసుకుంటారో అంతే త్వరగా అమల్లో పెడతారు కూడా. ఆత్మవిశ్వాసంతో ఉండే వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదట. వీరి మనసు నిరంతర ఆలోచనా స్రవంతి లాంటిదంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ది బెస్ట్ అనిపించుకుంటారు.
Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023
సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
సింహ రాశివారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఈ రాశివారి ప్లానింగ్ ఆలోచనా విధానం అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది. వ్యక్తిగత జీవితంతో పాటూ వృత్తిలోనూ వీరి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. అందుకే సింహ రాశి వారు ఇంటా-బయటా హీరోస్ అనిపించుకుంటారు. అనవసరంగా ఏ విషయాన్ని ఆలోచించరు కానీ..టైమ్ వేస్ట్ చేసుకోకుండా అవసరం అనుకున్నప్పుడే బ్రెయిన్ కి పదునుపెడతారు. తాము చేయాలి అనుకున్న పనికి ఎవరైనా అడ్డుపడితే అస్సలు సహించలేరు.
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
కన్యా రాశి (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ రాశి వారు చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌డ్ గా ఉంటారని అనుకుంటారు కానీ వీరి సైలెన్స్ వెనుక అవతలి వారిని నిశింతగా పరిశీలించే తత్వం ఉంటుంది. అది వీరికి మాత్రమే తెలుసు. వీరి దగ్గర పరిష్కారం లేని సమస్య ఉండదు. వీలైనంత తక్కువ సమయంలోనే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. వీరితో స్నేహం చేయాలని చాలామంది ఇంట్రెస్ట్ చెబుతారు.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశి వారు చాలా తెలివైనవాళ్లు. ఈ రాశివారికున్న తెలివితేటలు అద్భుతం. క్లిష్టమైన సందర్భాల్లో కూడా వీరి మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. నేర్చుకునే తత్వం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తే.. వారి ప్రవర్తనతో పాటు ఇతర అంశాల ద్వారా చిన్న క్లూ దొరికినా దాన్ని గుర్తించేస్తారు. అందుకే వృశ్చికరాశి వారిని అపర చాణక్యులు అంటారు
Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఈ రాశి వారి ఐక్యూ లెవెల్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. మార్కెట్లు, ట్రెండ్స్ అర్థం చేసుకోవడంలో వీరు ముందుంటారు. చాలా కష్టపడి ఫేమస్ అవుతారు. తమ తెలివితేటలతో ఒక్కో మెట్టు ఎక్కుతారు. మిగిలిన రాశుల వారితో పోల్చితే.. చదువులో కూడా వీరు చాలా ముందుంటారట. ఎంత క్లిష్టమైన సమస్యకైనా వీరి దగ్గర పరిష్కారం ఉంటుంది. వేరేవారి ఆలోచనలు ఎక్కడ ఆగిపోయాయో వీరి ఆలోచనలు అక్కడి నుంచి మొదలవుతాయి.