Daily Horoscope for March 21st 2024   


మేష రాశి


ఈ రాశివారు సమస్యలను శక్తివంతంగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలు పొందుతారు. పనిపట్ల మీకున్న విధేయతను ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. స్నేహితులతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు.  (మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి


కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ధ్యానంపై దృష్టి సారించాలి. సంపద పెరుగుతుంది. ఎదుటి వారిని విమర్శించే వైఖరికి దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ( వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   


మిథున రాశి


వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉన్నాయి.   తల్లిదండ్రుల సలహా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన సమయం ఇది. వైవాహిక సంబంధాలలో సంతోషం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త వనరులు కనుగొనవచ్చు. (మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి


ఈ రోజు మీరు ఎంతో కష్టపడితే కానీ మంచి ఫలితం పొందలేరు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. ఈ రోజు మీరు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. వ్యాపారం మెరుగుపడుతుంది. (కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)


సింహ రాశి


ఈ రోజు ప్రారంభం మీకు శుభప్రదం కాదు. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఒత్తిడికి గురికావొచ్చు. మీరు హింసాత్మక ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నష్టపోతారు.


Also Read: ఉగాది నుంచి ఈ రాశివారికి చుక్కలే - మనోధైర్యమే మిమ్మల్ని నడిపించాలి - శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు!


కన్యా రాశి


ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాతావరణంలో  వచ్చే మార్పుల వల్ల అనారోగ్యానికి గురవుతారు. కోపం తగ్గించుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఆశించిన ప్రేమ దొరుకుతుంది. 
 
తులా రాశి


రోజంతా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మీరు మీ కెరీర్‌లో మార్పును గమనిస్తారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రియమైనవారికి మనసులో మాట చెప్పొచ్చు.


వృశ్చిక రాశి


కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. సీనియర్ అధికారులు, ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. తండ్రి మిమ్మల్ని చూసి గర్వపడతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో ఒత్తిడి దూరమవుతుంది 


Also Read: ధనవ్యయం, అపనిందలు, నమ్మకద్రోహం - ఈ రాశివారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చాలా అప్రమత్తంగా ఉండాలి!


ధనుస్సు రాశి


వృత్తిలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజలు మీతో అబద్ధాలు చెబుతున్నారనే భావన మీ మనస్సులో తలెత్తవచ్చు. అనవసర పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. మీకు సన్నిహితంగా ఉండే వారి వల్ల టెన్షన్ ఉండవచ్చు.


మకర రాశి


ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని సంకల్పిస్తే ఈరోజు దానికి ఉత్తమమైన రోజు. కష్టపడి పనిచేయండి. సోమరితనం మిమ్మల్ని డామినేట్ చేయనీవొద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. కొన్ని వివాదాల కారణంగా ఇబ్బంది పడతారు. 


Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!కుంభ రాశి


నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. వృత్తి ఉద్యోగాల్లో మీ పని విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. మీ ఆత్మవిశ్వాం పెరుగుతుంది. 


మీన రాశి


వృత్తి, ఉద్యోగాల్లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ  అహంకారం వల్ల స్నేహితులు, సన్నిహితులు మీకు దూరం అవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.  


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.