SEBI Recruitment: ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్-1, ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తివివరాలు ఏప్రిల్ 13 నుంచి అందుబాటులో ఉంటాయి.
వివరాలు..
* అసిస్టెంట్ మేనేజర్: 97 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ జనరల్: 82 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ బ్యాచిలర్స్ లా డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/సీఏ/సీఎఫ్ఏ/సీఎస్/కాస్ట్ అకౌంటెంట్ అర్హత ఉండాలి.
➥ లీగల్: 05 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ లా డిగ్రీ. రెండేళ్ల లా ప్రాక్టిస్ ఉండాలి.
➥ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ: 24 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ/ ఇంజినీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/ఐటీ) అర్హత ఉండాలి.
➥ ఇంజీనీరింగ్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల (సీసీటీవీ తదితర) వినియోగానికి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. లిఫ్ట్స్, పంపులు, ఏసీప్లాంట్లు మెయింటెనెన్స్‌లో అనుభవం ఉండాలా.
➥ రిసెర్చ్: 02 పోస్టులు
అర్హతలు:
➛ మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా (ఎకనామిక్స్/కామర్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ఎకనామెట్రిక్స్/క్వాంటిటేటివ్ ఎకనామిక్స్/ఫైనాన్షియల్ ఎకనామిక్స్/మ్యాథమెటికల్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఇండస్ట్రియల్ఎకనామిక్స్/ బిజినెస్ అనలిటిక్స్. (OR)
➛ మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా (ఫైనాన్స్/ క్వాంటిటేటివ్ ఫైనాన్స్/మ్యాథమెటికల్ ఫైనాన్స్/క్వాంటిటేటివ్ ఫైనాన్స్/ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ / బిజినెస్ ఫైనాన్స్/ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైనాన్స్/ ప్రాజెక్ట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్/ అగ్రి బిజినెస్ ఫైనాన్స్. (OR)
➛ మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా (స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మాటిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మాటిక్స్/ డేటా సైన్స్ / ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ / మెషిన్ లెర్నింగ్/ బిగ్ డేటా అనలిటిక్స్. (OR)
➛ మాస్టర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్)తోపాటు ఏడాది పీజీ డిప్లొమా (స్టాటిస్టిక్స్) లేదా సంబంధిత విద్యార్హత ఉండాలి.
➥ అఫీషియల్ లాంగ్వేజ్: 02 పోస్టులు
అర్హతలు:
➛ మాస్టర్స్ డిగ్రీ (హిందీ)/హిందీ ట్రాన్స్‌లేషన్ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. (OR)
➛ మాస్టర్స్ డిగ్రీ (సంస్కృత/ఇంగ్లిష్/ఎకనామిక్స్/కామర్స్) ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. (OR)
➛ మాస్టర్స్ డిగ్రీ (హిందీ/హిందీ ట్రాన్స్‌లేషన్, ఇంగ్లిష్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.03.2024 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు. 01.04.1994 తర్వాత జన్మించినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆయా కేటగిరీల వారీగా వయోపరిమితిలోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ప్రారంభ వేతనం: నెలకు రూ.44500- రూ.89150.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.04.2024.
* దరఖాస్తుకు చివరితేది: ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 13న వెల్లడి కానున్నాయి.