Ravichandran Ashwin About Guntur Karam Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘గుంటూరు కారం‘. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ, వసూళ్ల పరంగా ఫర్వాలేదు అనిపించింది. తాజాగా ఈ చిత్రంపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పొగడ్తల వర్షం కురిపించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టింగ్, శ్రీలీల డ్యాన్స్ కు ఫిదా అయినట్లు చెప్పాడు.    


‘గుంటూరుకారం’పై అశ్విన్ ప్రశంసలు


సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పిన రవిచంద్రన్ అశ్విన్.. వాటి గురించి విశ్లేషణ చేసే శక్తి తనకు లేదన్నాడు. కానీ, రీసెంట్ గా తాను చూసిన ‘గుంటూరు కారం‘ సినిమా ఎంతో నచ్చిందన్నాడు. “నేను తరచుగా సినిమాలు చూస్తాను. కానీ, వాటి గురించి రివ్యూలు ఇవ్వను. రీసెంట్ గా మహేష్ బాబు సినిమా చూశాను. ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్ కలిగించింది. చూస్తున్నంత సేపు జాలీగా అనిపించింది” అని చెప్పుకొచ్చాడు.    


శ్రీలీల డ్యాన్స్ అద్భుతం- అశ్విన్


ఇక ‘గుంటూరు కారం’ చిత్రంలో శ్రీలీల డ్యాన్స్ కు అశ్విన్ ఫిదా అయ్యాడు. ఆమె లాంటి డ్యాన్స్ తాను ఇప్పటికీ చూడలేదన్నాడు. ఆమె స్టెప్స్ చూస్తే మతిపోయిందన్నాడు. చూడని వాళ్లు తప్పకుండా చూడాలని చెప్పాడు. అంతేకాదు, తనను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని కూడా శ్రీలీల డ్యాన్సును చూడాలని సలహా ఇచ్చాడు.టైమ్ లేకపోతే, కేవలం యూట్యూబ్ లో శ్రీలీల డ్యాన్స్ అయినా చూడాలని చెప్పాడు. యూట్యూబ్ లోకి వెళ్లి ‘గుంటూరు కారం’ సాంగ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుందన్నాడు. ఆ పాటకు శ్రీలీల వేసిన డ్యాన్స్ చూస్తే మతిపోతుందన్నాడు. మహేష్ బాబు కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసినట్లు చెప్పాడు. ఆయనను మించి శ్రీలీల డ్యాన్స్ చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ ఈ సినిమా గురించి అశ్విన్ కురిపించిన పొగడ్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా..


ఇక ‘గుంటూరు కారం’ సంక్రాంతి బరిలోకి దిగినా తొలి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ‘హనుమాన్’ సినిమా హవా ముందు ఈ చిత్రం నిలబడలేకపోయింది. కలెక్షన్స్ విషయంలో మాత్రం ఫర్వాలేదు అనిపించింది. ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. హారిక అండ్ హసన్ క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Read Also: రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్న ‘బిగ్ బాస్’ విన్నర్ - ఇంతకీ ఆ విషాన్ని ఏం చేస్తారు?