Daily horoscope 26th December 2024:ఈ రాశులవారు మాటల్లో కోపం తగ్గించుకునేందుకు ప్రయత్నించండి

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

మేష రాశి

Continues below advertisement

డిసెంబర్ 26 మేష రాశివారికి మంచి రోజు. నూతన అవకాశాలు తలుపుతడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. రాని బాకీలు వసూలవుతాయి. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారు శుభఫలితాలు పొందుతారు. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి. 

వృషభ రాశి

ఈ రాశివారికి ఈ రోజు అన్నీ సానుకూల  ఫలితాలే ఉన్నాయి. అనేక మూలాల నుంచి ఆర్థిక లాభం పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయాల్లో ఉండేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి.  ఇతరుల విషయాలపై శ్రద్ధ ఎక్కువ ఉంటుంది.

మిథున రాశి

ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు శుభసమయం. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. మాటల్లో కోపాన్ని బయటపడనీయొద్దు. భవిష్యత్తు కోసం విస్తృతమైన ప్రణాళికలు వేయవద్దు. విదేశాలలో విద్యను అభ్యసించే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. 

Alkso Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!

కర్కాటక రాశి
 
ఈ రోజు మీకు సానుకూల ఫలితాలున్నాయి. నూతన శక్తి వచ్చినట్టు భావిస్తారు. మీ పనిపై దృష్టి సారించండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.   పూర్వీకుల వ్యాపారంలో కొన్ని మెరుగుదలలు చేయడానికి ప్రయత్నించవచ్చు 

సింహ రాశి 

ఈ రోజు ఈ రాశివారి జీవితంలో సంతోషం ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగిన ఖర్చులుంటాయి. నిలిచిపోయిన పనిలో ఆకస్మిక పురోగతి ద్వారా మీరు ఉత్సాహంగా ఉంటారు.

కన్యా రాశి

ఈ రాశివారు తొందరపాటుగా డబ్బులు ఖర్చుచేసేస్తారు..అనవసరం అని తర్వాత తెలుసుకుంటారు..ముందే అప్రమత్తం అవండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువనివ్వండి. భవిష్యత్ కోసం నూతన ప్రణాళికలు వేసుకుంటారు. నూతన పెట్టుబడులకు మంచి రోజు అలవుతుంది.  ఈరోజు మీ మాటల వల్ల  చాలామంది ప్రభావితమవుతారు. 

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!

తులా రాశి

ఈ రోజు ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఆలోచనా విధానం సానుకూలంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  భవిష్యత్తులో మీకు హాని కలిగించే  చర్యలకు మొగ్గు చూపకండి. 

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కార్యాలయంలో మీకు మద్దతు పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్లాన్ చేసుకోండి. ఆరోగ్యం బావుంటుంది.  వ్యాపారంలో కొన్ని పెద్ద మార్పులకు దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి

ఈ రోజు అధిక పని ఒత్తిడికి దూరంగా ఉండాలి. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. ఈ రోజు మీరు డబ్బును అధికంగా ఖర్చు చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Also Read: కన్యారాశి వారికి కొత్త సంవత్సరం 2025 ఎలా ఉంటుంది.. ఏ రంగాల్లో సక్సెస్ అవుతారో తెలుసా!

మకర రాశి

ఈ రోజు మకర రాశివారికి సాధారణంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు పనిలో, వ్యాపారులు అమ్మకాలు కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం బావుంటుంది. ధ్యానంపై దృష్టి పెట్టండి. మీరు కొత్త ప్రణాళికలను ప్రారంభించవచ్చు 

కుంభ రాశి

ఈ రోజంతా బిజీగా ఉంటారు. ఇంట్లో-కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. పిల్లలు లేదా స్నేహితులకు సమయం కేటాయిస్తారు.  సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తుల గౌరవం పెరుగుతుంది

మీన రాశి

మీన రాశివారికి ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. పనిలో విరామం తీసుకోండి.  ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు మీకు ఇష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకోలడం మంచిది. మీ రహస్యాలను గోప్యంగా ఉంచండి. దేనికీ వెంటనే స్పందించకండి. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Continues below advertisement
Sponsored Links by Taboola