Budh Gochar 2025 April 08:  జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. బుద్ధి, జ్ఞానం, సంభాషణలకు కారకుడైన బుధ గ్రహం మిధునం మరియు కన్యారాశులకు అధిపతి. ఈ రెండు రాశులకు బుధ గ్రహం ఎల్లప్పుడూ ఆశీర్వాదం చేస్తుంది. త్వరలోనే బుధ గ్రహం తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. మరోవైపు ప్రస్తుతం మీన రాశిలో వక్రంలో ఉన్న బుధుడు ఏప్రిల్ 08న వక్రం పూర్తిచేసి సాధారణ స్థితికి చేరుతుంది. మీనంలో సంచరించి మే 04న మేష రాశిలో ప్రవేశిస్తుంది. అన్ని గ్రహాల కన్నా త్వరగా రాశి పరివర్తనం చెందే బుధుడి ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది.  ప్రస్తుతం బుధుడి సంచారం ఏ రాశులవారికి అదృష్టాన్నిస్తుందో తెలుసుకుందాం..

Continues below advertisement


శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


వృషభ రాశి (Taurus)


వృషభ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  బుధుడి సంచారం వృషభ రాశి వారికి జీవితంలో సానుకూల ఫలితాలను అందిస్తోంది.  వ్యాపారంలో ఎంతోకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒప్పందం మీ చేతికి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ సమయం మీకు అభివృద్ధిని తెస్తుంది.


మిథున రాశి (Gemini)


మిథున రాశి వారికి బుధుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది.  జీవితంలో ఆనందం పెరుగుతుంది.  ఉద్యోగం చేసే ప్రదేశంలో విజయం లభిస్తుంది. ప్రమోషన్ సంబంధిత సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.  ఉన్నతాధికారులు మరియు ఇతరులు మీ పనిని ప్రశంసిస్తారు. ఆరోగ్యం బావుంటుంది


కన్యా రాశి (Virgo)


మీన రాశిలో బుధుడి సంచారం కన్యారాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు న్యాయ సంబంధిత విషయాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేయాలి అనుకుంటే ఫలించే సమయం ఇది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.  


శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


తులా రాశి (Libra)


తులా రాశి వారికి బుధ గ్రహం సంచారం అదృష్టాన్నిస్తుంది.  ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలు ఉన్నాయి. మీరు ఎంతోకాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే, ఈ సమయంలో మీ అనేక ఇబ్బందులకు పరిష్కారం లభించవచ్చు. మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక స్థితి మీ మునుపటి కంటే ఈ సమయంలో బలంగా ఉంటుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది, పరీక్షల్లో విజయం సాధిస్తారు.


గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.


శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి