Daily Horoscope for 27 September 2024

మేష రాశి

ఈ రోజు మీరు చేపట్టే కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. వైవాహిక సంబంధాలలో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం బాధపెడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండండి. 

వృషభ రాశి

ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. తెలివైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారం, ఉద్యోగంలో లాభపడతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రత్యర్థులు బలహీనంగా ఉంటారు అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి.  

మిథున రాశి

ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.  అనవసరమైన పనుల్లో మీ సమయాన్ని వృథా చేయవద్దు. ప్రియమైనవారితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. కోపస్వభావం ఉన్నవారు విమర్శలు ఎదుర్కొంటారు. 

కర్కాటక రాశి

ఈ రోజు మీరు మీ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంట్లో, కార్యాలయంలో బిజీ బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచిమీకు ప్రేమ దొరుకుతుంది...కానీ మీ అభిప్రాయాన్ని చెప్పడం అత్యంత కష్టంగా ఉంటుంది. 

Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!

సింహ రాశి

ఈ రోజు ఏదో ఒక పని కారణంగా టెన్షన్ ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. కంటి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.  గడిచిన రోజుకన్నా ఈ రోజు కార్యాలయంలో సమస్యలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. 

కన్యా రాశి

నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. ఆరోగ్యం బావుంటుంది. తొందరపాటు పనులకు బదులు ఓపికగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. న్యాయపరమైన విషయాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారంలో లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  తులా రాశి

కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేస్తారు. మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. వ్యాపారంలో పెద్ద పెద్ద  ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వినోదం కోసం ఖర్చులు పెరుగుతాయి.

Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు! వృశ్చిక రాశి

ప్రణాళికాబద్ధంగా చేసే పనులలో విజయం ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది. సాయంత్రానికి పని ఒత్తిడి పెరుగుతుంది 

ధనుస్సు రాశి 

ఈ రోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మీ నెమ్మదైన స్వభావాన్ని మీ చుట్టూ ఉండేవారు అలుసుగా తీసుకుంటారు. మీ కుటుంబంలో చిన్నవారి గురించి ఆందోళన ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. 

మకర రాశి  వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పిల్లలు విధేయులుగా ఉంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు మంచి రోజు. తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని వదిలిపెట్టేయడం మంచిది. 

కుంభ రాశి

సన్నిహితులను కలిసే అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కోపం తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికందుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. 

మీన రాశి 

ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోండి. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుంటాయి. ఆర్థిక సంబంధిత నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. గౌరవం తగ్గకుండా చూసుకోండి.  

Also Read: తిరుమలలో మహాశాంతి హోమం..హోమాలతో దోషాలుపోతాయా - యజ్ఞం, యాగం, హోమం మధ్య వ్యత్యాసం ఏంటి !

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.