Daily Horoscope for 13 September 2024
మేష రాశి
మీ సమయాన్ని వృథా చేయకండి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ సన్నిహితుల నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాసలపై ఆసక్తి పెరుగుతుంది. సందేహాస్పద ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు. నూతన వ్యక్తులను కలుస్తారు.
వృషభ రాశి
చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. చిన్న చిన్న సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. పని మీద ఏకాగ్రత కష్టమవుతుంది. కొన్ని కారణాల వల్ల కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు.
మిథున రాశి
ఉదర సంబంధిత వ్యాధులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారంలో డాక్యుమెంట్ సంబంధిత పనులకు రోజు చాలా మంచిది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో కాంట్రాక్టుల వల్ల లాభం ఉంటుంది. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం.
కర్కాటక రాశి
ఈ రోజంతా జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలోని సమస్యలను తేలికగా తీసుకోవద్దు. ఆర్థిక విషయాలలో భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహ రాశి
ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ రోజు పాత స్నేహితులను కలవవచ్చు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఆరోగ్యం బావుంటుంది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకోండి.
Also Read: సెప్టెంబరు 14 పరివర్తన ఏకాదశి - ఈ రోజు ఈ నియమాలు పాటిస్తే మీకు అపజయం అనేదే ఉండదు!
కన్యా రాశి
ఈ రాశివారు పోటీ పరీక్షలలో గొప్ప విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. పిల్లలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కండరాల నొప్పి సమస్య ఉంటుంది. నూతన వ్యవహరాలు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం కాదు.
తులా రాశి
ఈ రోజు స్నేహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. దూర ప్రాంతాలు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది
వృశ్చిక రాశి
ఈ రోజు మీ శత్రువులు యాక్టివ్ గాఉన్నారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తేనే అర్థవంతమైన ఫలితాలు పొందగలరు. రోజు ప్రారంభం నిరాశగా ఉంటుంది కానీ ఆ తర్వాత యాక్టివ్ అవుతారు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.
ధనుస్సు రాశి
శుభ కార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో సవాళ్లు తప్పవు. మీ బాధ్యతలను నిజాయితీగా పూర్తిచేయండి. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. మీరు మీ మాటలతో ఎవరినైనా ప్రభావితం చేయగలరు.
మకర రాశి
క్రమరహిత ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చదువులో అసౌకర్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగులు,వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు
Also Read: మూడు అడుగులతో ముల్లోకాలను చుట్టేసిన త్రివిక్రముడి జయంతి!
కుంభ రాశి
అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీలో ప్రతిభను బయటకు తీసే సమయం ఇది. వ్యాపారంలో నగదు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది
మీన రాశి
ఈ రోజు మీరు మీ కెరీర్ విషయంలో సీరియస్‌గా ఉంటారు. అవసరం అయిన సమయంలో కార్యాలయంలో అధికారుల సహాయం తీసుకునేందుకు సంకోచించవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..ఖర్చులు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి..
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.