హీరోలకు హిట్స్ ఉంటేనే ఓటీటీ వేదికలు రెడ్ కార్పెట్ పరిచే రోజులు ఇవి. వరుస ప్లాపులు వస్తే ముఖం చాటేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన తాజా సినిమా 'భలే ఉన్నాడే' డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడం విశేషం. ఆ రెండిటిని ఒక్క సంస్థ తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఈటీవీ చేతికి రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే'
రాజ్ తరుణ్ హీరోగా జె శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహించిన 'భలే ఉన్నాడే' (Bhale Unnade Movie)ను రవికిరణ్ ఆర్ట్స్ పతాకం మీద ఎన్ వి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్. ఈ రోజు (సెప్టెంబర్ 13 న) థియేటర్లలోకి సినిమా వచ్చింది. మరి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?
Bhale Unnade movie OTT platform: 'భలే ఉన్నాడే' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ యాప్ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను కూడా ఈటీవీ సంస్థ తీసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత టీవీకి వస్తుంది. 'పురుషోత్తముడు', 'తిరగబడరసామి' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత రాజ్ తరుణ్ నుంచి వస్తున్న చిత్రమిది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రామిసింగ్ గా ఉండటంతో మంచి బజ్ నెలకొంది.
అమ్మాయిలకు చీర కట్టే యువకుడిగా రాజ్ తరుణ్
భలే ఉన్నాడే సినిమాలో రాజ్ తరుణ్ డిఫరెంట్ రోల్ చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు సినిమాలో ఇప్పటివరకు అటువంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు అని చెప్పాలి. అమ్మాయిలకు చీర కట్టే యువకుడిగా (saree draper) ఆయన నటించారు. మహిళలను ముట్టుకోకుండా శారీ కట్టడం ఆయన స్టైల్. అటువంటి అబ్బాయిని ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. నిశ్చితార్థం కూడా చేసుకుంటుంది. ఆ తరువాత ఏమైంది అనేది థియేటర్లలో చూడాలి. పెళ్లికి హీరో పనికిరాడు అని హీరోయిన్ తండ్రి ఎందుకు వ్యాఖ్యానించాడు? హీరో హీరోయిన్ల మధ్య దూరం ఎందుకు పెరిగింది? అనేది ఆసక్తికరం.
Also Read: పెళ్లికి ముందు కండిషన్స్ పెట్టిన అక్కినేని ఫ్యామిలీ? - అందుకు శోభిత నో చెప్పడం వెనుక రీజన్ అదేనా?
రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటించిన ఈ సినిమాలో లెజెండరీ దర్శకుడు 'సింగీతం' శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, 'హైపర్' ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, 'రచ్చ' రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, 'పటాస్' ప్రవీణ్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నగేష్ బానెల్లా, సంగీతం: శేఖర్ చంద్ర, దర్శకత్వం: జె శివ సాయి వర్ధన్, సమర్పణ: మారుతి టీమ్, నిర్మాత: ఎన్వీ కిరణ్ కుమార్.