Sagittarius  Yearly Horoscope 2024: ధనస్సు రాశివారికి 2024లో అదృష్టం కలిసొస్తుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలబడతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మేధోపరమైన పనిలో అద్భుతంగా రాణిస్తారు. పురోభివృద్ధి బాటలు తెరుచుకుంటాయి. పోటీలలో మంచి విజయాలు సాధిస్తారు. కష్టపడి సంపాదించే మార్గాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కలలు ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. ఇంట్లో సమస్యలు ఇబ్బందిపెడతాయి. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ ధనస్సు రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 


Also Read: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!


(Sagittarius January to December Horoscope 2024)


జనవరి
ధనుస్సు రాశి వారికి  ఏడాది ఆరంభం అదిరింది. జనవరి నెలలో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలకోసం సమయాన్ని వెచ్చిస్తారు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సాన్నిహిత్యం ప్రయోజనకరంగా ఉంటుంది.


ఫిబ్రవరి
ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొనసాగుతున్న పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి ఈ అడ్డంకులను ఎదుర్కొంటారు. సమస్యలను పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది


Also Read: ఈ రాశివారికి 2024లో అనారోగ్యం, మానసిక ఒత్తిడి తప్పదు - ఆ 3 నెలలు కొంత ఉపశమనం!


మార్చి, ఏప్రిల్
మార్చి, ఏప్రిల్ నెలల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. పై అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, వాహనాలకు సంబంధించిన విషయాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. నిద్రలేమి ఇబ్బందికరంగా ఉంటుంది. మార్చి చివరి భాగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.


ఏప్రిల్ 
ఏప్రిల్ నెల మొత్తం బావుంటుంది. ప్రతి పని సులువుగా పూర్తవుతుంది. వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందకు సాగుతుంది. ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేయవచ్చు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు


Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది


మే, జూన్ 
ఈ రెండ నెలలు పోరాటానలతో నిండి ఉంటుంది.  ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టొచ్చు. మోకాలికి గాయం అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో తగాదాలు రావచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. ఎటువంటి కారణం లేకుండా శత్రువులు మిమ్మల్ని వేధించవచ్చు.


జూలై, ఆగష్టు
జూలై, ఆగష్టు నెలల్లో కూడా కష్టాలు తప్పవు. ఆరోగ్య పరంగా ఇబ్బందులుంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు పెరుగుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.  ఆగష్టు నెలలో పురోగతి బావుంటుంది. పెండింగ్ పనులన్నీ పరిష్కారం అయ్యే మార్గాలు కనిపిస్తాయి. ఇంట్లో  సంతోషం పెరుగుతుంది.


సెప్టెంబరు, అక్టోబరు 
ఈ రెండు నెలలు చాలా వరకూ బాగానే ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. తెలివైనవారి సహవాసంతో ప్రయోజనాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బృహస్పతి తిరోగమనంలో ఉండటం వల్ల విద్యార్థులకు కొన్ని సమస్యలు తప్పవు.  మేధోపరమైన పనిలో తక్కువ ప్రయోజనం ఉంటుంది.


Also Read: ఈ రాశివారికి 2024లో ఈ 4 నెలలు పరీక్షా కాలమే!


నవంబర్, డిసెంబర్
2024 లో చివరి రెండు నెలల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. ఇంట్లో ఆందోళనలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వామి చేతిలో మోసపోవచ్చు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఆందోళన పెంచుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. డిసెంబరు లో ఆర్థికంగా బలపడతారు. భూమి, వాహనం  కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు సాగుతుంది. డిసెంబరు ఆఖర్లో కుటుంబంలో సంతోషం ఉంటుంది.  


Sagittarius Health Rashifal 2024
2024 సంవత్సరం మీ ఆరోగ్యంపై మిశ్రమ ప్రభావాలను చూపుతుంది.  తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి 


Sagittarius Bussines and Money Rashifal 2024
2024 లో ధనుస్సు రాశి వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపారం పుంజుకుంటుంది. ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. 


Sagittarius Education Rashifal 2024
2024 సంవత్సరం ధనుస్సు రాశి వారి విద్యార్థులకు సాఫీగా సాగిపోతుంది. తీవ్రమైన అడ్డంకులు ఏమీ ఉండవు. ఈ రాశికి చెందినవారు పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఇదే మంచి సమయం. 


Sagittarius  Marriage Life Rashifal
ఈ రాశివారి వైవాహిక జీవితం మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. తీవ్రమైన కలహాల తర్వాత మళ్లీ పరిస్థితి సర్దుమణుగుతుంది


Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు


పరిహారం:  ధనుస్సు రాశి వారు  ఆదిత్య హృదయం నిత్యం చదువుకోవాలి...ప్రతి బుధవారం వినాయకుడిని పూజించాలి


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం


2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి