29th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
ఈ రోజు  మీ స్వార్థం కోసం ఎవరినీ తప్పుదోవ పట్టించకండి...దీని కారణంగా మీరు తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మీరు మీ పని పట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించండి. బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి


వృషభ రాశి
కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. పని ప్రదేశంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు సహాయం చేస్తుంది.    సహోద్యోగులతో సత్ప్రవర్తన వల్ల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు, విద్యార్థులకు మంచి రోజు


మిథున రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కార్యాలయంలో మీకు ఇబ్బందులు పెరగవచ్చు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సొంత వ్యాపారం చేసేవారు..పూర్తిస్థాయిలో బిజినెస్ పై దృష్టి సారించడం మంచిది. మీరు ఎలా మాట్లాడుతున్నారో శ్రద్ధ వహించండి..లేదంటే మీ మాటలు అపార్థాలకు దారితీస్తాయి.


Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది


కర్కాటక రాశి
మీలో మీరు మీతో మీరు ఉండడం కాకుండా అందరిలో కలసి మీ నెట్ వర్క్ విస్తరించుకోవడం మంచిది.. మీకంటూ ఓ టీమ్ ఉండడం మీ భవిష్యత్ కి చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబపరంగా సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడతారు. కోపం తగ్గించుకోండి...మీకు తెలియకుండానే మాట తూలుతారు జాగ్రత్త.


సింహ రాశి
ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు.  భవిష్యత్తులో మీకు ప్రయోజనం కలిగించే పెద్ద పనులను చేపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభదినం. ఈ రోజు వైవాహిక జీవితంలో చాలా మంచి రోజు అవుతుంది. ప్రేమలో ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు..మీ ప్రియమైన వారితో సమయం గడుపుతారు. 


కన్యా రాశి
ఈ రోజు మీరు కలిసొస్తుంది. మీ మీ రంగాల్లో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న ఈ రాశికి చెందిన వ్యక్తులు కొంత పెద్ద బాధ్యతను పొందవచ్చు. ప్రజల్లో మీ ఆదరణ పెరుగుతుంది. చిన్న తరహా వ్యాపారాలు చేసే వారికి మంచి లాభం చేకూరుతుంది.


తులా రాశి
దీర్ఘకాలంలో భారీ లాభాలను సంపాదించేందుకు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇది అనుకూల సమయం. టైమ్ మీకు కలిసొస్తుంది..ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్ లో ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.


వృశ్చిక రాశి
ఈ రోజు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మీకు అదృష్టం కలిసొస్తుంది. మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది . డబ్బు ఆదా చేయడంలో సక్సెస్ అవుతారు


Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు


ధనుస్సు రాశి 
ఈరోజు మీకు చాలా మంచి రోజు. అందరితో కలసి ఉండేందుకు ప్రయత్నిస్తారు. కోర్టు వ్యవహారాలున్నవారు ఈ రోజు వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు.అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. మీ జూనియర్లు, సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. 


మకర రాశి 
మకర రాశి విద్యార్థులకు ఈ రోజు కాస్త కష్టంగానే ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు చేయాల్సి రావొచ్చు. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఏదైనా పెద్ద పని చేయాలని ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు


కుంభ రాశి
ఈ రోజు మీ మానసిక స్థితి బావుంటుంది. కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. నిలిచిపోయిన పాత ప్రణాళికలు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. 


మీన రాశి
ఈ రోజు మీకు బావుంటుంది. ఈ రాశికి చెందిన రచయితలకు శుభసమయం...మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ రచనలు ప్రశంసలు అందుకుంటాయి. ఈ రోజు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత స్నేహితుడిని కలవవచ్చు.


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి