13th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. నిర్ణయాలుతీసుకునేటప్పుడు తెలివిగా వ్యవహరించండి.
వృషభ రాశి
భవిష్యత్తు గురించి ఆందోళనలు ఉంటాయి. ఒకరి భద్రతను నమ్మి రిస్క్ తీసుకోవద్దు. పెట్టుబడులు కలిసొస్తాయి. ఈ రోజు ఓ శుభవార్త వింటారు. వివాదాల్లో తలదూర్చవద్దు. దీర్ఘకాలిక నొప్పితో బాధపడతారు.
మిథున రాశి
కొత్త పని ప్రారంభించేందుకు ఈ రోజు మంచి రోజు. మీ మానసిక స్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. మీ తెలివితేటల ముందు ప్రత్యర్థులు ఓడిపోతారు. ఇష్టదైవం ఆశీశ్సులతో పనులు విజయవంతం అవుతాయి
Also Read: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
కర్కాటక రాశి
మీ పనులను సమయానికి విభజించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వివాదాలు పెంచుకోవద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు
సింహ రాశి
మీ అలవాట్లు కొన్ని మార్చుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండండి. పిల్లలతో విభేదాలు ఏర్పడతాయి. రావాల్సిన సొమ్ము చేతికందడం ఆలస్యం అవుతుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
కన్యా రాశి
మీకు ఇష్టమైన వారితో మీ మనసులోని మాటను చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. తృణధాన్యాలు, నూనె గింజలు వ్యాపారం చేసేవారికి మంచి సమయం. ఉద్యోగులకు మంచి రోజు. ప్రయాణాలు కలిసొస్తాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళితలు అమలవుతాయి.
తులా రాశి
అనుకున్న సమయానికి పని పూర్తి చేస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది. సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబంలో వివాదాల కారణంగా ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో హడావుడి ఉంటుంది.
Also Read: కార్తీకమాసం ఎప్పటితో ఆఖరు, పోలిపాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం మొత్తం మీదే!
వృశ్చిక రాశి
కొత్త వాహనం, యంత్రాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడకండి. కుటుంబానికి సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ కారణంగా జీవిత భాగస్వామి ఆందోళన చెందుతుంది
ధనుస్సు రాశి
మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు..మీరు అనుకున్న పని అనుకున్నట్టు చేయండి. పిల్లలు సంతోషంగా ఉంటారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
మీ మనసులోని మాటను మీ ప్రియమైన వారికి చెప్పే అవకాశం మీకు లభిస్తుంది.రోజు రొటీన్ గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. ఉదర సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి
మీ ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోండి. కుటుంబంలో పెద్దల మద్దతు మీకు ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. విద్యార్థులకు శుభసమయం. పార్టీలు, పిక్నిక్ లలో ఎంజాయ్ చేస్తారు.
మీన రాశి
కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత జీవితంలో టెన్షన్ ఉంటుంది. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. గాయం, దొంగతనం కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. రిస్క్ తీసుకోవద్దు.