Poli Swargam 2022 date:  కార్తీకమాసం నెలరోజుల పాటూ నియమంగా పాటించినవారు...అమావాస్య మర్నాడు..మార్గశిర మాసం మొదటి రోజు అయిన పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు..ఆ రోజుతో కార్తీకమాసం పూర్తైనట్టు. ఆ రోజునే పోలిపాడ్యమి లేదా పోలిస్వర్గం అంటారు. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చింది..పోలి అంటే ఎవరు? 


పోలి స్వర్గం కథ 
పూర్వం ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలోని చిన్నకోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచీ దైవ భక్తి ఎక్కువ. కానీ అదే భక్తి అత్తగారికి కంటగింపుగా మారింది. తనలాంటి భక్తురాలు మరొకరు ఉండరని తనదే నిజమైన భక్తి అనే అహంభావంతో ఉండేది. అందుకే కార్తీకమాసం రాగానే పోలిని కాదని మిగిలిన తోడికోడళ్లని వెంటబెట్టుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలు వెలిగించి తీసుకొచ్చేది.ఈ లోగా కోడలు దీపం పెట్టేస్తుందేమో అనే ఆలోచనతో ఎలాంటి సౌకర్యం అందుబాటులో లేకుండా చేసేది.  పోలి మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. .పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరి కంటా పడకుండా దానిపై బుట్ట  బోర్లించేంది. ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ నాడు కూడా నదీస్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు చకచకా ముగించి..కార్తీక దీపాన్ని వెలిగించింది. 


Also Read: నవంబరు 17న రాశిమారుతున్న సూర్యుడు, ఈ రాశులవారికి బాగా కలిసొస్తుంది


ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా పోలి భక్తిమార్గం తప్పకపోవడం చూసి దేవతలంతా దీవించారు. ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంతో వచ్చారు దేవదూతలు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు...మిగిలిన తోడికోడళ్లు పోలిని విమానాన్ని చూసి నిర్ధాంతపోయారు ధర్మాచరణ చూసి  ఱాధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పవిమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె మిగతా కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయ్యారు. ఆమెతో పాటూ తాముకూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందనే వదిలేస్తారు.


Also Read:  వైరాగ్యం కావాలంటే శివుడికి వీటితో అభిషేకం చేయండి


అందుకే అమావాస్య మర్నాడు పాడ్యమి రోజు పోలిని తల్చుకుంటూ ఆమెలా స్వర్గ ద్వార ప్రవేశం కలగాలని కోరుకుంటారు. అరటిదొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీకమాసంలో నెలరోజులూ దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ ఒక్కరోజు 30 ఒత్తులతో దీపాన్ని వెలిగించి అరటి దొప్పల్లో వదిలితే నెలరోజులూ చేసిన పుణ్యం దక్కుతుందని చెబుతారు. అదే రోజు బ్రాహ్మణులకు దీపదానం చేసి స్వయంపాకం ఇస్తే మంచిదంటారు. 


ఈ ఏడాది నవంబరు  23 బుధవారం కార్తీక అమావాస్య...నవంబరు 24 గురువారం పోలి పాడ్యమి....


నోట్: బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న విషయం పక్కనపెడితే పాటించాల్సిన ఆచారాన్ని పద్ధతిగా పాటిస్తే రావాల్సిన ఫలితం వస్తుందన్నదే కథలో ఆంతర్యం.