Happy Akshaya Tritiya 2025 Wishes in Telugu : ప్రతి సంవత్సరం వైశాఖ మాసం తదియ రోజు అక్షయ తృతీయ జరుపుకుంటారు. శుభాలనిచ్చే అక్షయ తృతీయని ఇప్పుడు బంగారంతో ముడిపెడుతున్నారు. విలువైన వస్తువులు, లోగాలు కొనుగోలు చేసే రోజుగా చూస్తున్నారు. అక్షయ తృతీయ రోజు ఏం కొన్నా అక్షయం అవుతుందనే ప్రచారం మాయలో పడుతున్నారు. అది నమ్మి అప్పులు చేసి కూడా బంగారం కొనుగోలు చేసేవారున్నారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే కాదు..దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని అర్థం. ఏప్రిల్ 30 అక్షయ తృతీయ సందర్బంగా మీ స్నేహితులు, సన్నిహితులపై శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనేవారు తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి
ఈ అక్షయ తృతీయ రోజు మీపై శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబి నీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు
మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపక్షుద్ర మమృత్యవః
భయశోక మనస్తాపా నశ్యంతు మమ సర్వదా
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు
రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
శ్రీ పర్వదినం రోజు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
మీ కుటుంబంలో ఈ రోజు ఉండే ఆనందం శాశ్వతం కావాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
మీ జీవితంలో వృద్ధి సాధించాలి, చేపట్టిన పనుల్లో విజయం మిమ్మల్ని వరించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు
శ్రీ మహాలక్ష్మి కరుణతో ఆరోగ్యం , సంపద, శ్రేయస్సు మీ సొంతం కావాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
అక్షయ తృతీయ పర్వదినం రోజు మీ ఆకాంక్ష నెరవేరాలి, సంపద వృద్ధి చెందాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
అక్షయ తృతీయ రోజు మాత్రమే కాదు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సదా మీపై ఉండాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు
ఈ రోజు మీ ప్రార్థనలు అపరిమితమైన పుణ్యఫలాన్ని అందించాలి
మీ ప్రయత్నంలో ఉండే లోపాలు తొలగి విజయం వరించాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
అక్షయ తృతీయ రోజు మీరు పెట్టే పెట్టుబడులు అక్షయం కావాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
సంపద మాత్రమే కాదు మీ ఇంట్లో ఆనందం అక్షయం కావాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు
అక్షయ పాత్ర ఎలా ఉంటుంది , ఇప్పుడు ఎక్కడుంది - అక్షయపాత్ర గురించి ఆసక్తికర విషయాలివి!