వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నుంచి తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నారు. చేవెళ్ల టు చేవెళ్ల దాదాపుగా 4 వేల కిలోమీటర్లు 400 రోజుల పాటు చేయనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ భరోసా ఇస్తూ తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రను గుర్తు చేయాలనుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ తర్వాత పాదయాత్ర చేపడుతున్న వ్యక్తిగా షర్మిల ఆ ఘనత సాధించారు. ఇవాళ ఆమె కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. తండ్రికి నివాళులు అర్పించారు.  అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.  






Also Read: కేశినేని నిజంగా పార్టీ మారుతున్నారా? ఆయన సన్నిహితుడు ఏం చెప్పారంటే..


వైఎస్ఆర్ పాలన తీసుకురావడమే లక్ష్యం 


వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే రైతులకి ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ అని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే పేద పిల్లలకు ఉచిత విద్య, పేద వాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వడం అని గుర్తుచేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన ఉందా అంటే లేదు అనే సమాధానమే వస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు.  వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలు పెడుతున్నామన్నారు. 


Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?


ప్రజల పక్షాన పోరాటం


తెలంగాణ మొత్తం తిరిగి ప్రతి పల్లెకు వెళ్తానని, ప్రతి గడపను తడతానని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటామన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.  ప్రజల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పాదయాత్రను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా అన్నారు. అందరూ కలిసి పోరాడితే వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ సాధ్యమవుతుందన్నారు.  


Also Read:  కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష... విద్యుత్ కొరత రాకుండా అత్యవసర ప్రణాళికలు చేపట్టాలని ఆదేశాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి