ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. అవినీతి జరిగి ఉండే రిపోర్ట్ లను బయట పెట్టాలి కదా అని విజయ సాయి వ్యాఖ్యానించారు.
లైట్ తీసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి...
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమమన్వయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరని ఆయన అన్నారు. కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరన్నారు.రెండు ప్రభుత్వాలు మధ్య ఎప్పటికి సత్సంబంధాలు ఉంటాయని తెలిపారు.అవినీతి ఎక్కడ జరిగిందో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లు చెప్పలేకపోయారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు కదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వాళ్ళ ఆడిటింగ్ లో ఎక్కడైనా అవినీతి జరిగిందని గుర్తించారా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. అవినీతి అనేది సాధారణంగా చేసే ఆరోపణల్లో భాగంగా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ విషయాలపై ఎందుకు మాట్లాడలేదు..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ రద్దు పై ప్రకటన చెయ్యలేదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి అన్నారు. విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ తోను పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు.
చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడతారా..
తెలుగు దేశం అధినేత చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడే అవకాశం లేదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయని అది రాజకీయంగా జరిగే ప్రక్రియగానే చూడాలని సూచించారు. చంద్రబాబు మిని మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నవంబర్ లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎన్నికల మేనిఫెస్టోను కాపి కొట్టి చంద్రబాబు మేనిస్టో రెండు ను విడదల చేస్తారేమో అని వ్యాఖ్యానించారు.
పరిపాలన రాజధాని విశాఖ...
విశాఖపట్నం కేంద్రంగా ఖచ్చితంగా పరిపాలన రాజధాని తరలిస్తామని విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. రెండు నెలల కిందటే పరిపాలన రాజధానికి కావాల్సిన కార్యాలయాలను గుర్తించామని ఆయన అన్నారు.విశాఖ పట్టణం తరలింపుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకున్నామని, విధి విధానాల పై జగన్ కూడ త్వరలో ప్రకటన చేస్తారని తెలిపారు. విశాఖ పట్టణాన్ని పరిపానా రాజధాని చేసి తీరుతామని వెల్లడించారు.
ప్యాకేజీతో సంబంధం లేకుండా నిధులు..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నిధులకు విభజన ప్యాకేజికి సంబందం లేదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ప్రకటించిన ప్యాకేజీతో సంబంధం లేకుండా రెవెన్యూ లోటు కింద 10,400 కోట్లు కేంద్రం నుండి నిధులను సాధించామని చెప్పారు. కేంద్రం నుండి త్వరలోనే మరో నాలుగు వేల కోట్ల రూపాయలు కూడ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆ తరువాతే పోలవరం నిధులు...
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత పోలవరం ప్రాజెక్టుకి నిధులు వస్తాయని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి పోలవరం ను పూర్తి చేసే బాధ్యతను సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నాని, దాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు.
ప్రతి కార్యకర్త కీలకం...
వరుసగా అనుభంధ సంఘాలతో విజయ సాయిరెడ్డి సమావేశం అవుతున్నారు. ఈ నేపద్యంలో కార్యకర్తల నుండి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఎన్నికలలోపు ప్రతి కార్యకర్త ని సంతృప్తి పరుస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.