తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. కుప్పం నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 25 వార్డుల్లో ఏకగ్రీవంతో కలిసి 19 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించారు. చైర్మన్ అభ్యర్థి , మాజీ సర్పంచ్ త్రిలోక్ కూడా పరాజయం పాలయ్యారు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆయన 50 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 


Also Read : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్..కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ !


అధికార వైఎస్ఆర్‌సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో  ఓ వార్డు ముందుగానే ఏకగ్రీవం అయింది. మిగిలిన చోట్ల పోరు హోరాహోరీగా సాగింది. 5, 11, 18, 19, 20 , 22 వార్డుల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి సుధీర్ గట్టి పోటీ ఎదుర్కొన్నా విజయం సాధించారు. దీంతో ఆయనే మున్సిపల్ చైర్మన్ కానున్నారు. 


Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దశాబ్దాలుగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా అక్కడి నియోజకవర్గంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ఎప్పటికప్పుడు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్థానిక టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కావడం .. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల ప్రయోజనాలు పొందిన వాళ్లు సైలెంట్ కావడంతో ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. 


Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!


చంద్రబాబు నియోజకవర్గంలో పట్టు సాధించి టీడీపీని నైతికంగా దెబ్బకొట్టాలని వైఎస్ఆర్‌సీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఏం చేసినా తమకే ప్రజలు తమకే ఓట్లేస్తారని ఆశించిన టీడీపీ నేతలకు భంగపాటు ఎదురైంది. దీంతో నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రతిఘటించారు. కానీ అధికార బలం ముందు వారి ప్రతిఘటన సరిపోలేదు. చివరికి పరాజయం వెక్కిరించింది.


Also Read: Minister Kannababu: మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయి.. త్వరలో చూస్తారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి