ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Governament ) చేసిన నిధుల దుర్వినియోగంపై సీబీఐ  ( CBI ) విచారణ జరిపించాలని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ( Yanamala ) డిమాండ్ చేశారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము రూ. రూ.48 వేల‌ కోట్లు వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) నేతల జేబుల్లోకి వెళ్లాయని సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి సమర్పించిన కాగ్ రిపోర్టులో  ( CAG Report ) బిల్లులు లేకుండా రూ. 48వేల కోట్లు ఖర్చు చేశారని తేల్చారు. దీనిపైనే యనమల ఆరోపణలు చేశారు.  రూ.48వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. 


.రూ.1.78 ల‌క్షల కోట్లు ఖ‌ర్చు పెడితే రూ.48వే ల కోట్ల‌కు లెక్క‌ల్లేవని కాగ్ చెబుతోందన్నారు.  ఈ మేర‌కు నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌ని యనమల ఆరోపించారు. ప్ర‌జ‌ల కోసం రూ.48వేల కోట్లు ఖ‌ర్చు పెడితే లెక్క‌లు ( Audit ) ఎందుకు చెప్ప‌లేక‌పోతోంద‌ని ప్రశ్నించారు.  రూ.48వేల కోట్ల ఖ‌ర్చుకు సంబంధించి స్పెష‌ల్ బిల్లుల ( Special Bills )  పేరుతో ఖ‌ర్చు పెట్టామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని ..కానీ  స్పెష‌ల్ బిల్లుల‌నేవి ట్రెజ‌రీ కోడ్ ( Tresary Code ) లోనే లేద‌ని స్పష్టం చేశారు. ఈ మేర‌కు భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జ‌రుగుతోంద‌న్నారు.  కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏపీ విష‌యంలో కేంద్రం ఆర్టిక‌ల్ 360ని ( article 360 ) అమ‌లు చేయాల‌ని యనమల డిమాండ్ చేశారు. 


అసెంబ్లీ చివిరి రోజున అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశ పెట్టారు.  ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 48 వేల కోట్లకి బిల్స్ లేవని కాగ్ తన నివేదికలో తేల్చి చెప్పింది. అలాగే అదనంగా చేసిన రూ.  88 వేల కోట్ల అప్పు బడ్జెట్ లో చూపించలేదని కూడా స్పష్టం చేసింది.  శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలులేదు.  కానీ ఏపీ ప్రభుత్వం రూ. 1,10,509. 12 కోట్లను అసెంబ్లీ ఆమోదం లేకుండానే అడ్డదిడ్డంగా ఖర్చు చేసేసిందని కాగ్ తెలిపింది. బిల్లులు లేకుండా చెల్లించిన మొత్తాలకు స్పెషల్ బిల్లులుగా ప్రభుత్వం పేర్కొంది. దీన్ని కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది. రుణాలు కూడా జిఎస్‌డిపిలో 35 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. వీటిపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.  దీనిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు స్పందించలేదు.