YSRCP :    గణేష్ నిమజ్జనం ఎక్కడైనా ధూమ్ ధామ్‌గా చేస్తారు. డాన్సులతో హోరెత్తిస్తారు. భక్తులకు అన్నదానం చేస్తారు. ఇదంతా జరిగేదే. అయితే సినిమాలో డైలాగులా.. ఇవన్నీ అందరూ చేస్తారు.. కానీ మద్యాన్ని డ్రమ్ముల్లో పోసి భక్తులకు పోసే వారికే ఓ రేంజ్ ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుకున్నారేమో కానీ అదే పని చేశారు. ఇది ఎక్కడో కాదు. ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లిలోనే. ఆయన నివాసానికి అతిక కొద్ది దూరంలో ఉన్న గణేష్ మండపంలోనే.


ఎంపీ, ఎమ్మెల్యేల ఆశీస్సులతో ఏర్పాటైన గణేష్ మండపంలో అపచారం


తాడేపల్లి వైఎస్ఆర్‌సీపీ నాయకులు పట్టణంలో ఉత్సవ కమిటీగి ఏర్పడి గణేష్ ఉత్సవ ఏర్పాట్లు చేశారు. పూజలు చేశారు. ఇక నిమజ్జనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అన్నదానం, గానా బజానా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, రాజ్య సభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి కూడా వచ్చారు. వారుండగానే మందు బాబులకు పండుగ వాతారణాన్ని అక్కడ కల్పించారు. 




ఢిల్లీ లిక్కర్ స్కాం: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు - ఒకేసారి దేశవ్యాప్తంగా 30 చోట్ల


డ్రమ్ముల నిండా మద్యం తెచ్చి ట్యాప్ తో మద్యం సరఫరా


వాటర్ డ్రమ్ముల నిండా మద్యం పోసి..దానికి ట్యాప్ పెట్టి.. మందు బాబులందర్నీ క్యూలో నిలబెట్టారు. తర్వాత ఒక్కొక్కరికి ఆ డ్రమ్ములోనుంచి మద్యం నింపి ఇచ్చారు.ఇలా వందల మంది గ్లాసులు గ్లాసులు తాగారు. ఒక్కొక్కరికి ఒక్కో బాటిల్ పంచితే  ఖర్చయిపోతుందని అనుకున్నారేమోకానీ.. ఇలా డ్రమ్ముల్లో తెప్పించి పంచేశారన్నమాట. ప్రస్తుతం మద్యం మొత్తం  ప్రభుత్వ అధీనంలో ఉంది. కొనాలంటే అక్కడే కొనాలి. డ్రమ్ముల్లో మద్యం అమ్మే సంప్రదాయం ఇం కారాలేదు కాబట్టి.. బాటిల్స్ కొని డ్రమ్ములో పోసి..ఇలా పంపిణీ చేసి ఉంటారని భావిస్తున్నారు.


గుర్తుంచుకోండి, మీకూ ఇదే గతి పట్టిస్తాం - అసెంబ్లీ బయట ఈటల, రఘునందన్ సవాల్


ఎగబడి గ్లాసులతో పట్టుకుని తాగేశారు 


అయితే అధికార పార్టీ నేతలు కాబట్టి ఎలా పంపిణీ చేసినా ఎవరూ అడిగేవారు ఉండరు. డ్రమ్ములతో నేరుగా డిస్టిలరీల నుంచి తీసుకొచ్చినా అడిగేవారు ఎవరూ ఉండరని టీడీపీ నేతలు అంటూ ఉంటారు. అయితే స్థానికులు మాత్రం దేవుడి ఉత్సవాలను అపవిత్రం చేశారని మండి పడుతున్నారు. ఇలాంటి చేయడం హిందూ పంప్రదాయాన్ని కించ పరచడమేనని వారంటున్నారు. నిరుపేదల మద్యం అలవాటును ఆసరాగా చేసుని వారి బలహీనతతో ఆడుకుంటున్నారని మండి పడుతున్నారు. 


ఫ్లెక్సీ మిస్సింగ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ


గణేష్ ఉత్సవాలను అపవిత్రం చేశారని విమర్శలు


సీఎం ఇంటికి సమీపంలోనే ఇలా జరగడం... ఎమ్మెల్యే, ఎంపీలు కూడా వచ్చిన సందర్భంలోనే ఇలా జరగడంతో...సహజంగానే  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. దీని వైఎస్ఆర్‌సీపీ నేతలెవరూ స్పందించలేదు..  తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం  అధికార పార్టీ నేతలుహిందూ ధర్మాన్ని కించ పరుస్తున్నారని విమర్శిస్తున్నారు.