SC On Hijab Case: ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది- కానీ బడిలో ఉంటుందా?: సుప్రీం

ABP Desam Updated at: 06 Sep 2022 11:53 AM (IST)
Edited By: Murali Krishna

SC On Hijab Case: పాఠశాలల్లో మత స్వేచ్ఛను వినియోగించుకోవచ్చా అని సుప్రీం కోర్టు పేర్కొంది. హిజాబ్ అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

(Image Source: PTI)

NEXT PREV

SC On Hijab Case: హిజాబ్ అంశంపై సుప్రీం కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని, అయితే యూనిఫాం ధరించాలనే నిబంధన ఉండే పాఠశాలల్లోనూ హిజాబ్​ ధరించ వచ్చా అని ప్రశ్నించింది.


కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాన్శు ధూలియాలతో కూడిన ధర్మాసనం విచారించింది.



ప్రతి వ్యక్తికీ మత స్వేచ్ఛ ఉంటుంది. అయితే నిర్దిష్ట ఏకరూప దుస్తులు (యూనిఫాం) ధరించాలనే నిబంధన ఉన్న పాఠశాలల్లోనూ మత స్వేచ్ఛను వినియోగించుకోవచ్చా? లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న.                                        -  సుప్రీం ధర్మాసనం


ఈ మేరకు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సంజయ్‌ హెగ్డేను ఉద్దేశించి సుప్రీం వ్యాఖ్యానించింది. 


మరో ప్రశ్న


ప్రస్తుత వ్యవహారం కేవలం విద్యాసంస్థల్లో క్రమశిక్షణకు సంబంధించినదేనని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కె.ఎం.నటరాజ్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు స్పందించింది.





ఒక బాలిక హిజాబ్‌ ధరిస్తే బడిలో క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఎలా అవుతుంది? అయినా కర్ణాటక ప్రభుత్వం ఏ హక్కునూ కాదనట్లేదు. నిర్దేశిత యూనిఫాంలో మాత్రమే విద్యాసంస్థలకు రావాలని చెబుతోంది.                                         - సుప్రీం ధర్మాసనం


సుప్రీం చేసిన వ్యాఖ్యలపై అదనపు సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ



హిజాబ్‌ ధరించే హక్కు తనకు ఉంది కనుక పాఠశాలలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తానని మతాచారం ముసుగులో చెప్పడం సరికాదు.                                                                        - కేఎం నటరాజ్, అదనపు సొలిసిటర్ జనరల్


Also Read: China Earthquake: చైనాను కుదిపేసిన భారీ భూకంపం- 46 మంది మృతి!


Also Read: లక్కీ లేడి, తన కారు నెంబర్లు చెప్పి రూ.43 లక్షలు గెలుచుకుంది - ఇదిగో ఇలా!

Published at: 06 Sep 2022 11:36 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.