వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఏపీకి, సీఎం జగన్ కు ముడిపెడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల అన్నారు. డ్రగ్స్ అంశంపై సీబీఐ, డీఆర్ఐ విచారణ జరుపుతున్నాయని సజ్జల తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 2.5 లక్షల కిలోల గంజాయి పట్టుకున్నామని వెల్లడించారు. ఆధారాలు లేకుండా టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పాండోరా పత్రాల్లో జగన్ పేరు ఉండొచ్చన్న టీడీపీ నేతల వ్యాఖ్యలు అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ఈ ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జల స్పష్టం చేశారు.


Also Read: టాలీవుడ్ పెద్ద దిక్కెవరో తేల్చనున్న "మా" ఎన్నికలు ! అసలు పోటీ మోహన్‌బాబు, చిరంజీవి మధ్యేనా ?


ప్రభుత్వంపై విషప్రచారాలు


చంద్రబాబు ఆరోపణలకు అడ్డుఅదుపులేకుండా పోతుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి పక్షాలు ఏక్కడ ఏది జరిగినా ప్రభుత్వంపై విషప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. హెరాయిన్‌, డ్రగ్స్‌లకు ఏపీ అడ్డగా మారిందని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దిగజారి మరీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తమకు అనుకూలంగా కథనాలు రాయించుకుంటున్నారని విమర్శించారు. 


Also Read: NGT Verdict: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో పిటిషన్... ఏపీ కోర్టు ధిక్కరణపై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్


డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కుపాదం


హెరాయిన్‌ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ నేతలకే డ్రగ్స్‌ తో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని సజ్జల విమర్శించారు. రూ.వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో గంజాయి రవాణాను చూసీ చూడనట్లు వదిలేశారని పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారని తెలిపారు. గంజాయి రవాణాపై అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారని పేర్కొ్న్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా టీడీపీ మారడంలేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 


Also Read: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం.. ఆ విషయంపై అవగాహన కల్పించాలి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి