Ysrcp Fan Rushed Towards CM Jagan in Denduluru Meeting: ఏలూరులోని దెందులూరు (Denduluru) 'సిద్ధం' సభలో శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సభలో వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సీఎం జగన్ (CM jagan) ప్రజలకు అభివాదం చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుంటూ ఆయన వైపు దూసుకొచ్చాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, వారిని వారించిన జగన్.. సదరు అభిమానిని దగ్గరకు తీసుకుని.. అతని కోరిక మేరకు సెల్ఫీ దిగారు. అనంతరం భద్రతా సిబ్బంది అతన్ని కిందకు తరలించారు. కాగా, 'ఇదీ జగనన్న అంటే', 'ప్రజలపై ఆయనకున్న అభిమానం అంటే ఇదే', 'సరిహద్దులు లేని అభిమానం' అంటూ వైసీపీ శ్రేణులు ఆ వీడియోను షేర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
'చంద్రముఖి నిద్ర లేస్తుంది'
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి విజయాన్ని అందించాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. 'సిద్ధం' సభలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. '57 నెలల్లో మీ బిడ్డ మీ మంచి కోసం 124 సార్లు బటన్ నొక్కాడు. ఈ మంచి ఇలాగే జరగాలంటే.. నాకోసం 2 బటన్స్ నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం.. మరొకటి ఎంపీ ఎన్నిక కోసం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపించండి. లేకుంటే గత ఎన్నికల్లో ఓటుతో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకునిపేదల రక్తం తాగేందుకు 'లక లక' అంటూ ప్రతీ ఇంటింటికీ వస్తుంది. అబద్ధాలతో తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుంది. 2024లో జగనన్నకు ఓటేస్తే ఆ చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా తప్పుతుంది. చంద్ర గ్రహణాలు ఉండవు' అంటూ సీఎం పేర్కొన్నారు. ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లు అన్న ఆయన.. అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని.. వైసీపీకి మరో చారిత్రాత్మక విజయం అందించేందుకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Also Read: CM Jagan: 'మీరు కృష్ణుడైతే నేను అర్జుడిని' - నా కోసం మీరు ఒక్కసారి ఆ బటన్ నొక్కాలన్న సీఎం జగన్